సిల్క్ స్మిత ధైర్యాన్ని ప్రశంసించిన స్టార్ హీరోయిన్
కఠినమైన సమయాల్లో తనను తాను బెస్ట్ గా ఉంచుకోవడానికి కుటుంబం మద్దతుగా నిలిచిందని తెలిపారు బాలన్.
By: Tupaki Desk | 8 March 2025 7:00 AM ISTలైంగిక వివక్ష, స్త్రీ పురుష విభేధం గురించి ప్రస్థావించారు స్టార్ హీరోయిర్ విద్యాబాలన్. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన పోరాటాల గురించి బాలన్ ని మీడియా ప్రశ్నించగా, దానిని ఎప్పుడూ పోరాటంగా చూడలేదని, ప్రయాణంలో భాగంగా మాత్రమే చూశానని విద్యా చెప్పారు. దక్షిణ భారత కుటుంబం నుండి వచ్చిన బాలన్ సహనం ముఖ్యమని నమ్ముతుంది. తిరస్కరణలను ఎదుర్కొన్నప్పటికీ అవకాశాలను వదులుకోవాలని ఎప్పుడూ భావించలేదు. కఠినమైన సమయాల్లో తనను తాను బెస్ట్ గా ఉంచుకోవడానికి కుటుంబం మద్దతుగా నిలిచిందని తెలిపారు బాలన్.
అలాగే బాలీవుడ్ సమాజంలో ద్వంద్వ ప్రమాణాల గురించి చర్చిస్తూ, తెరపై బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ పాత్రల్లో నటించినా కానీ, నిజ జీవితంలో ఎల్లప్పుడూ స్త్రీలు గౌరవం అందుకోలేరని విద్యా ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమస్యలు సామాజికమైనవి. నిజానికి మహిళలు పోటీ పడటం కంటే ఒకరినొకరు ఆదరించడంతోనే సరిపుచ్చుతారని బాలన్ వ్యాఖ్యానించారు. పురుషాధిక్య ప్రపంచంలో నాయికా ప్రధాన చిత్రాలు తీయాల్సిన అవసరం గురించి బాలన్ మాట్లాడారు. మహిళలు కూడా పురుషులతో సమాన ప్రాతినిధ్యం సాధించిన తర్వాత అణగిమణిగి ఉండాల్సిన పని లేదని బాలన్ అన్నారు.
మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. కేవలం నటిగా అడుగు పెట్టడం మాత్రమే కాదు,..తమదైన మార్గాన్ని నిర్ణయించుకునే శక్తిని కలిగి ఉండటం సాధికారత అని పేర్కొంది. `ది డర్టీ పిక్చర్`లో తన పాత్రను ప్రతిబింబిస్తూ, నిజమైన సాధికారత ప్రతికూల పరిస్థితుల్లో కూడా సొంత ఎంపికలతో ముందుకు సాగడమేనని అన్నారు. తన నిబంధనల ప్రకారం.. జీవితాన్ని గడపడంలో సిల్క్ స్మిత ధైర్యాన్ని బాలన్ మెచ్చుకుంది. బాడీ ఇమేజ్‌పై పరిశ్రమకు ఉన్న వ్యామోహాన్ని విద్యా బాలన్ పరిహాసంగా ప్రస్తావించింది. ప్రజలు నిరంతరం డైట్ ప్లాన్‌లను ఎలా సూచిస్తున్నారో కూడా తెలిపింది. ఇటీవలే బాలన్ ను ఫెడరల్ బ్యాంక్ తమ బ్రాండ్ ప్రమోటర్ గా ఎంపిక చేసుకుంది. ఈ సందర్భంగా విద్యా మాట్లాడుతూ-``ది డర్టీ పిక్చర్ విజయం తర్వాత ఆమెకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కోసం చాలా ఆఫర్లు వచ్చాయని వెల్లడించింది.
కానీ దురదృష్టవశాత్తు కార్ బ్రాండ్‌లు, బ్యాంకులు ఎప్పుడూ తనను సంప్రదించలేదు. మహిళలు డ్రైవింగ్ చేయడానికి, ఆర్థిక నిర్వహణకు సరిపోరని పరిమితం చేయబడ్డారని బాలన్ గ్రహించినట్టు తెలిపారు. సమాజంలో అంతర్లీనంగా ఉన్న లైంగిక వివక్షను ఎత్తి చూపారు.
భారతదేశంలో మహిళలు తమ ఆర్థిక వ్యవహారాలను తమ తండ్రి లేదా భర్త చేతిలో వదిలేయాలని భావిస్తున్నారని విద్యా అన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో స్వతంత్రురాలైనప్పటి నుండి బాలన్ ఎక్కువ డబ్బు సంపాదించడం ప్రారంభించింది. మహిళలు తమకు అవసరమైన డబ్బును తామే ఆర్జించాలని బాలన్ ప్రేరణనిచ్చింది.