Begin typing your search above and press return to search.

హీరోతో ఏంటీ లంచం గోల?

తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు విద్యుత్ జమ్వాల్. ఓ బాలీవుడ్ విమర్శకుడిపై బహిరంగంగా ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు. తనను ఆ క్రిటిక్ బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 6:13 AM GMT
హీరోతో ఏంటీ లంచం గోల?
X

బాలీవుడ్ స్టార్ విద్యుత్ జమ్వాల్ కు సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమైన విన్యాసాలు చేయడంలో ముందుంటారన్న పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. వరల్డ్ వైడ్ ఉన్న ఆరు అగ్రశేణి మార్షల్ ఆర్టిస్టులలో ఒకరిగా ఆయనకు ఓ గుర్తింపు ఉంది. లూపర్ క్యూరేట్ చేసిన ప్రతిష్ఠాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ఇండియన్ గా రికార్డ్ కూడా ఉంది. అయితే విద్యుత్ జమ్వాల్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

ఇటీవల ఆయన ఊహించని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రమాదకరమైన విన్యాసాలు చేసినందుకు ముంబయి రైల్వే పోలీసులు విద్యుత్ ను అదుపులోకి తీసుకున్నట్లు వినిపించింది. దీనిపై ఇప్పటి వరకు విద్యుత్ స్పందించలేదు. అంతకుముందు ఒంటిపై నూలు పోగు లేకుండా హిమాలయాల్లో సేదతీరారు. ఆ ఫొటోలు అప్పట్లో నెట్టింట ఫుల్ వైరల్ అయ్యాయి.

తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు విద్యుత్ జమ్వాల్. ఓ బాలీవుడ్ విమర్శకుడిపై బహిరంగంగా ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు. తనను ఆ క్రిటిక్ బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. "ఎక్కడైనా లంచం అడగడం నేరం, ఇవ్వడం కూడా నేరమే. అయితే లంచం ఇవ్వకపోవడమే నేను చేసిన నేరమా? మీరు పొగిడిన ప్రతీసారి నేరస్థుడు అని తెలుసు" అని బాలీవుడ్ క్రిటిక్ సుమిత్ ను ట్యాగ్ చేశారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఆ బాలీవుడ్ క్రిటిక్ కూడా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. కానీ విద్యుత్ జమ్వాల్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. "ఆదరణ అహంకారంగా మారినప్పుడు అది పతనానికి దారితీస్తుంది. నెపోటిజం ట్యాగ్‌లు ఉన్నప్పటికీ చాలా మాంది స్టార్లు వినయంగా ఉంటారు. కానీ ఒక వ్యక్తి బిహేవియర్ భయంకరంగా ఉంది. అందుకే ఇండస్ట్రీ ప్రముఖులు అతడితో పనిచేయడం మానేశారు" అని ట్వీట్ చేశారు.

ఆ తర్వాత మరో ట్వీట్ కూడా చేశారు సుమిత్. "ఫోక్స్.. నేను ముందు చేసిన ట్వీట్ పై క్లారిటీ ఇస్తున్నాను. అది ఏ సూపర్ స్టార్ లేదా ప్రస్తుత తరం స్టార్స్ కోసం కాదు.. స్టార్ కాకపోయినా తనను తాను బ్రూస్ లీ, జాకీ చాన్ గా భావించుకునే వేరొకరి కోసం" అని తెలిపారు. తెలుగులో శక్తి, బిల్లా 2, ఊసరవెల్లి సినిమాల్లో నటించిన విద్యుత్.. ఇటీవల విడుదలైన హిందీ మూవీ క్రాక్ కు దర్శకత్వం వహించారు. మరి ఆ క్రిటిక్ తో విద్యుత్ కు జరిగిన గొడవేంటో తెలియాల్సి ఉంది.