NBKతో అన్‌స్టాపబుల్..చరణ్ ఎపిసోడ్ వ్యూస్ పీక్స్
అన్‌స్టాపబుల్ విత్ NBK మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని నాల్గవ సీజన్ ని విజయవంతం చేయడంలో బాలయ్య స్పీడ్ సర్వత్రా చర్చగా మారుతోంది.
By: Tupaki Desk | 20 Jan 2025 4:27 AM GMTనందమూరి బాలకృష్ణ భారతదేశంలోనే అత్యంత సక్సెస్ ఫుల్ టీవీ హోస్ట్ లలో ఒకరిగా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. ఆయన హోస్ట్ గా సరసమైన భాష, ఛమత్కారమైన శైలి, అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ .. ప్రతిదీ అభిమానులను ఆకట్టుకున్నాయి. బుల్లితెర లేదా ఓటీటీలో హోస్ట్ గా బాలయ్య రాణించగలరా? అనే ప్రశ్నకు ఆయన ప్రాక్టికల్ గా ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది.
అన్‌స్టాపబుల్ విత్ NBK మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని నాల్గవ సీజన్ ని విజయవంతం చేయడంలో బాలయ్య స్పీడ్ సర్వత్రా చర్చగా మారుతోంది. ఇప్పటికే వరుస ఎపిసోడ్స్ ఆహా వ్యూయర్స్ ని కట్టి పడేస్తున్నాయి. తాజా ఎపిసోడ్ భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ అగ్ర హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి అతిథులతో షో ప్రజాదరణ కొత్త శిఖరాలకు చేరుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం కాగా, రెండవ భాగం కూడా `ఆహా`లో అందుబాటులోకి వచ్చింది. తాజా సమాచారం మేరకు.. చాలా తక్కువ సమయంలో రెండవ ఎపిసోడ్ 5 కోట్ల (50 మిలియన్ల)కు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను అధిగమించింది.
దీనిని బట్టి మెగా - నందమూరి అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంత ఎగ్జయిటింగ్ గా వేచి చూసారో అర్థమవుతోంది. రామ్ చరణ్- బాలకృష్ణ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులను మరింత ఎగ్జయిట్ చేసింది. ఆ ఇద్దరి మధ్యా సరదా సంభాషణలు అందరికీ నచ్చాయి. చరణ్ ఒదిగి ఉండే స్వభావం, హోస్ట్ తో ఎంతో గౌరవంగా నడుచుకున్న తీరు ప్రతిదీ ఆకట్టుకున్నాయి. ఇక చరణ్ తో బాలయ్య ఎంతో ఛమత్కారమైన ఫన్నీ సంభాషణలతో రక్తి కట్టించారు. దీంతో వీక్షణలకు ఢోఖా లేకుండా పోయింది. ఈ ఎపిసోడ్ పరిశ్రమలో మెగా- నందమూరి క్లాష్ కి అతీతమైనది. కొందరు ఫ్యాన్స్ ఊహలకు అతీతంగా, వారి మధ్య సత్సంబంధాలు ఎలా ఉంటాయో బయటపెట్టింది.