Begin typing your search above and press return to search.

ప్రస్తుత టైమ్‌ జోన్‌లో 'బాహుబలి' చేయగలమా : విఘ్నేష్‌ శివన్‌

ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌గా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(LIK).

By:  Tupaki Desk   |   30 Nov 2024 5:03 AM GMT
ప్రస్తుత టైమ్‌ జోన్‌లో బాహుబలి చేయగలమా : విఘ్నేష్‌ శివన్‌
X

ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌గా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(LIK). ఈ సినిమాకు నయనతార ఒక నిర్మాతగా ఉన్నారు. విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కథ ప్రస్తుత కాలమానంలో కాకుండా కొన్ని సంవత్సరాల ముందు అంటూ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది, ఎలా అప్పటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనే విషయాలను చూపించే విధంగా ఉంటుందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు విఘ్నేష్ శివన్‌ స్పందించారు.

తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ... LIK సినిమా కోసం మొదట శివ కార్తికేయన్‌ను అనుకున్నాం. ఆయన్ను సంప్రదించడం జరిగింది. ఆయన హీరోగా భారీ బడ్జెట్‌తో ఫ్యూచర్‌ టైమ్‌ జోనర్‌లో సినిమాను రూపొందించాలని ప్లాన్‌ చేశాం. కానీ బడ్జెట్‌ భారీగా పెరిగి పోయింది. దాంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. అంత భారీ బడ్జెట్‌తో ఫ్యూచర్‌ టైమ్‌ జోన్‌లో సినిమా తీసే బదులు ప్రస్తుత టైమ్‌ జోన్‌లో ఎందుకు సినిమాను తీయకూడదు అని అడిగారు. అందుకు నేను అంగీకరించలేదు. నా సినిమాను నేను అనుకున్నట్లుగానే తీయాలి అనుకుని ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లుగా పేర్కొన్నాడు.

బాహుబలి సినిమాను ఇప్పుడు టైమ్‌ జోన్‌లో తీయడం సాధ్యం కాదు. అలాగే తన ప్రాజెక్ట్‌ సైతం ఫ్యూచర్‌ టైమ్‌ జోనర్‌లోనే ఉండాలని, అలా చేస్తేనే కథకు న్యాయం జరుగుతుంది అనే అభిప్రాయంను విఘ్నేష్‌ శివన్‌ వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు మెల్ల మెల్లగా సాగుతున్నాయి. ఈ ఏడాదిలో విడుదల చేయాలని మొదట భావించినా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూనే ఉంది. వచ్చే ఏడాదికి అయినా ఈ సినిమా పూర్తి అవుతుందా, ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమా కంటే ముందు విఘ్నేష్ శివన్‌ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా ఒక సినిమా రూపొందించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ మలయాళ మూవీ ఆవేశం తరహాలోనే అజిత్‌ కోసం విఘ్నేష్‌ రెడీ చేసుకున్న కథ ఉండటంతో పాటు మరికొన్ని కారణాల వల్ల సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అజిత్‌తో సినిమా అంటే నిర్మాతలు చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుంటారు. ప్రతి ఎలిమెంట్‌ సినిమాలో ఉండాలని అంటారు. అలా ఎంత వరకు సాధ్యం అనే ఉద్దేశ్యంతో తాను అజిత్‌ సినిమాను వదిలేసినట్లుగా విఘ్నేష్ శివన్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.