నయన్ భర్త బెదిరిపోయాడా?
కోలీవుడ్ లో హీరో ధనుష్, నయనతార మధ్య నడుస్తోన్న వివాదం గురించి అందరికి తెలిసిందే.
By: Tupaki Desk | 1 Dec 2024 4:47 AM GMTకోలీవుడ్ లో హీరో ధనుష్, నయనతార మధ్య నడుస్తోన్న వివాదం గురించి అందరికి తెలిసిందే. నయనతార లైఫ్ స్టోరీని నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గా రిలీజ్ చేసింది. దీనికి మంచి స్పందన వస్తోంది. అయితే ఇందులో నయనతార విగ్నేష్ శివన్ షూటింగ్ సెట్ లో మాట్లాడుకుంటున్న ఒక వీడియో బిట్ ని యూజ్ చేశారు. అది ధనుష్ నిర్మించిన ‘నేను రౌడీనే’ సినిమా షూటింగ్ సమయంలో షూట్ చేసింది. దీంతో ధనుష్ నయనతార మీద కేసు వేశారు.
పర్మిషన్ లేకుండా తన సినిమా షూటింగ్ కి సంబందించిన వీడియోని వినియోగించుకున్నందుకు 10 కోట్లు చెల్లించాలని కోర్టు ద్వారా నోటీసులు పంపించారు. దీనికి కౌంటర్ గా నయనతార బహిరంగ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది. నయనతార కూడా ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గలేదు. న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమైంది.
అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వీరి వివాదం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ధనుష్ ఫ్యాన్స్ నయనతార, విగ్నేష్ శివన్ ని ట్యాగ్ చేసి విమర్శలు చేస్తున్నారు. విగ్నేష్ కు దర్శకుడికి లైఫ్ ఇచ్చింది ధనుష్ అని కౌంటర్ ఇస్తున్నారు. ఇక ఈ విషయంలో నయన్ రియాక్ట్ అయినట్లు ఆమె భర్త అసలు రియాక్ట్ కావడం లేదు. మరోవైపు నయనతార అభిమానులు కూడా ధనుష్ ఫ్యాన్స్ కి కౌంటర్లు ఇస్తున్నారు. ఇండస్ట్రీలో కూడా కొందరు నయనతారకి మద్దతుగా నిలిచారు. రీసెంట్ గా నయనతార పరోక్షంగా ధనుష్ పైన సోషల్ మీడియాలో విమర్శలు చేసింది.
ఇది అప్పు అనుకో… కచ్చితంగా దానికి వడ్డీతో సహా తిరిగొస్తుంది అంటూ చేసిన కామెంట్ వైరల్ గా మారింది. ఈ వివాదం ఇలా నడుస్తూనే ఉండటంతో కోలీవుడ్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ తాజాగా ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివిట్ చేశారు. కారణం చెప్పలేదు కానీ.. ట్విట్టర్ లో అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని విగ్నేష్ డిసైడ్ అయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.
ఇక మరికొందరు విగ్నేష్ భార్యకు సపోర్ట్ చేయలేక, ధనుష్ ని ఏమి అనలేక బెదిరి సోషల్ మీడియా నుంచి తప్పుకున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం విగ్నేష్ శివన్ ప్రస్తుతం ప్రదీప్ రంగనాథ్ తో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, విమర్శలకి దూరంగా ఉండాలని ట్విట్టర్ డీయాక్టివేట్ చేసి ఉంటాడనే మాట వినిపిస్తోంది.