Begin typing your search above and press return to search.

లోకేశ్ - దళపతి కాంట్రవర్సీ.. సారీ చెప్పిన నయన్ భర్త

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నెటిజన్లు ట్రోల్స్​తో ఓ ఆటాడేసుకుంటారు

By:  Tupaki Desk   |   9 Oct 2023 8:30 AM GMT
లోకేశ్ - దళపతి కాంట్రవర్సీ.. సారీ చెప్పిన నయన్ భర్త
X

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నెటిజన్లు ట్రోల్స్​తో ఓ ఆటాడేసుకుంటారు. బై మిస్టేక్‌లో లైక్ కొట్టినా, ఫాలో అయినా, రీ ట్వీట్ లేదా కామెంట్​ చేసినా అంతే సంగతి. తాజాగా నయనతార భర్త దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఇలాంటి చిక్కుల్లోనే పడ్డాడు. పైగా అది విజయ్ దళపతి - లోకేశ్ కనగరాజ్​ రూమర్​ కాంట్రవర్సీకి సంబంధించి. దీంతో ఇప్పుడు విజయ్, లోకి ఫ్యాన్స్.. విఘ్నేశ్‌ను తెగ ఆడేసుకుంటున్నారు.

వివరాళ్లోకి వెళితే.. లోకేశ్ కనగరాజ్ ఆ మధ్య.. తన ట్విట్టర్ బయోలో నుంచి లియో సినిమాను తీసేశాడు. దీంతో విజయ్, లోకేశ్ మధ్య ఏదో జరిగిందని, సంథింగ్ ఈజ్ ఫిషీ అని అంతా అనుకున్నారు. అందుకే లోకేశ్ ఇలా చేసి ఉంటాడని అంతా అనుకున్నారు. ఇదే విషయంపై మీడియాతో లోకేశ్ ముచ్చటించాడు. అయితే దీనికి సంబంధించే ఓ ట్రోలింగ్ ట్వీట్‌ను విఘ్నేశ్ శివన్ లైక్ కొట్టాడు.

దీంతో విజయ్ - లోకేశ్ అభిమానులు.. విఘ్నేశ్​పై మండిపడ్డారు. బాగా ట్రోల్ చేశారు అతడిని. అంతే ఇక తన తప్పు తెలుసుకున్న విఘ్నేశ్ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ గందరగోళం క్రియేట్ అయినందుకు విజయ్​ - లోకేశ్ ఫ్యాన్స్​కు క్షమాపణలు. ఆ ట్వీట్​లో ఏముందో.. ఆ ఇంటర్వ్యూ ఏంటో చూడకుండా.. లోకేశ్​ ఫోటో ఉంది కదా? అందుకే లైక్ చేశాను. అతడికి పెద్ద ఫ్యాన్ నేను. అయితే ఇప్పుడు తప్పు తెలుసుకున్నాను. అదొక సిల్లీ మిస్టేక్. విజయ్ సర్, లోకేశ్ కనకరాజ్ అంటే నాకు చాలా ఇష్టం. లియో పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను. అంటూ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు. చూడాలి మరి ఈ ట్వీట్‌తో అయినా విఘ్నేశ్ మీద ట్రోలింగ్ ఆగుతుందేమో..

కాగా, లియో సినిమా ఈ అక్టోబర్ 19న గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్ కానుంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో త్రిష హీరోయిన్​గా నటించగా.. అర్జున్ సర్జా, సంజయ్ దత్​ కీలక పాత్రల్లో నటించారు.