జనంలోకి స్టార్ హీరో..ఇదే చివరి చిత్రమా?
ఈ సినిమాకి 'జన నాయగన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. అలాగే భారీ బహిరంగ సభలో ప్రజల మధ్యలో విజయ్ సెల్పీ దిగిన న్యూలుక్ ని లాంచ్ చేసారు.
By: Tupaki Desk | 26 Jan 2025 9:04 AM GMTదళపతి విజయ్ తమిళనాట ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో 69వ చిత్రం ఎలాంటి కథాంశంతో వస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించగానే దర్శకుడు హెచ్. వినోధ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే సినిమా అవుతుందని పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది.
విజయ్ రాజకీయ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకునే కథ సిద్దం చేసాడని...విజయ్ పొలిటికల్ లాంచింగ్ కి ముందు పర్పెక్ట్ చిత్రం, మైలేజ్ ఇచ్చే చిత్రం అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అటుపై విజయ్ 70వ చిత్రం కూడా తెరపైకి వస్తోన్న నేపథ్యంలో 69 ఓ తెలుగు స్టార్ హీరో సినిమాకి రీమేక్ అన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా విజయ్ కొత్త పోస్టర్...సినిమా టైటిల్ తో అన్నింటికి వినోధ్ తెర దించేసాడు.
ఈ సినిమాకి 'జన నాయగన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. అలాగే భారీ బహిరంగ సభలో ప్రజల మధ్యలో విజయ్ సెల్పీ దిగిన న్యూలుక్ ని లాంచ్ చేసారు. బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ దుస్తుల్లో విజయ్ లుక్ బాగుంది. వెనుక భారీ జనసంద్రాన్ని చూడొచ్చు. అందరూ తెలుపు రంగు షర్ట్ ధరించి విజయ్ ని చూసి అభివాదం చేస్తున్నారు .
'నాయగన్' అంటే తెలుగులో నాయకుడు అని అర్దం. దీంతో ఇది పక్కా రాజకీయ నేపథ్యం గల సినిమా అని తెలిపోయింది. అలాగే విజయ్ చివరి చిత్రం కూడా ఇదేనని దాదాపు క్లారిటీ వచ్చినట్లే. ఈ సినిమా తర్వాత విజయ్ జనాల్లోకి వెళ్లిపోతాడు. జమిలీ ఎన్నికలు అంటోన్న నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కూడా మళ్లీ ప్రజల్లోకి వచ్చేస్తున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో విజయ్ ఎంట్రీ కూడా షురూ అవ్వడం ఆసక్తికరం. అలాగే విజయ్ 70వ చిత్రం ఉండటానికి ఇక అవకాశాలు లేవనే చెప్పాలి.