Begin typing your search above and press return to search.

రామాయణంలో దేవరకొండ.. నిజమేనా?

భారతీయ ఇతిహాసాలు, పురాణాలలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   2 Sep 2024 6:15 AM GMT
రామాయణంలో దేవరకొండ.. నిజమేనా?
X

భారతీయ ఇతిహాసాలు, పురాణాలలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ కూడా చాలా ఉంటాయి. గతంలో ఈ ఇతిహాసాలని తెరపైన ఫిల్మ్ మేకర్స్ ఆవిష్కరించేవారు. సోషల్ కాన్సెప్ట్ లతో స్టోరీస్ చెప్పడం ఎప్పుడైతే మొదలైందో పురాణ, ఇతిహాసాలని సినీ దర్శక, నిర్మాతలు టచ్ చేయడం మానేశారు. అడపాదడపా కొంతమంది వీటిని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసేవారు.

అలాగే ఇతిహాస కథలని సీరియల్స్ గా తెరకెక్కించారు. వీటిలో రామాయణ, మహాభారత ఇతిహాసాలని సినిమాలు, సీరియల్స్ గా చూసారు. ముఖ్యంగా రామాయణ కథని అయితే అన్ని భాషలలో తెరకెక్కించారు. రామాయణాన్ని ఎన్ని సార్లు సీరియల్స్, సినిమాలుగా తెరపై ఆవిష్కరించినా ప్రేక్షకులు ఆధరిస్తూనే ఉన్నారు. అలాగే మహాభారతంలో ఉండే కథ, డ్రామాని కూడా ఆస్వాదిస్తున్నారు. మరల ఇప్పటి టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ ని ఉపయోగించుకొని ఇతిహాస కథలకి దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు.

ఇప్పటికే ఇతిహాసాలలో ఉండే హీరోలని బేస్ చేసుకొని సూపర్ హీరో కథలని ప్రశాంత్ వర్మ పునఃసృష్టి చేస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ కల్కి2898ఏడీ సినిమాని భాగావంతం, మహాభారతం, కల్కి పురాణం రిఫరెన్స్ తో తెరకెక్కించారు. మహాభారతంలో కురుక్షేత్ర ఘట్టాన్ని కూడా కల్కిలో చూపించారు. హిందీలో నితీష్ తివారి రామాయణం సినిమాని సిరీస్ లు గా చేయడానికి రెడీ అవుతున్నారు.

తెలుగులో కూడా రామాయణం కథతో మూవీ చేయడానికి ప్రముఖ దర్శకుడు సిద్ధం అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇందులో శ్రీరాముడి క్యారెక్టర్ కోసం విజయ్ దేవరకొండని తీసుకోవాలని భావిస్తున్నారంట. ఇప్పటికే విజయ్ తో డిస్కషన్ చేసి స్టోరీ కూడా నేరేట్ చేసారంట. విజయ్ దేవరకొండ ఒప్పుకున్నాడా లేదా అనే విషయంలో క్లారిటీ అయితే లేదు. కల్కి 2898ఏడీ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించారు. ఆ లుక్ కి పెర్ఫెక్ట్ గా విజయ్ సెట్ అయ్యాడు.

ఈ నేపథ్యంలో రామాయణంలో రాముడి క్యారెక్టర్ కి విజయ్ అయితే బాగుంటుందని సదరు దర్శకుడు భావించి ఆయనని ఒప్పించారనే ప్రచారం నడుస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగానే విజయ్ దేవరకొండ రామాయణం సినిమాని చేయడానికి నిర్ణయించుకుంటే మాత్రం అది అతని కెరియర్ లో బెస్ట్ ఛాయస్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. శ్రీరాముడి క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ మెప్పిస్తే అతను స్టార్ హీరోగా మారే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.