Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ పెళ్లి.. తండ్రి ఏంచెప్పారంటే?

అయితే ఇప్పట్లో విజయ్ వివాహం ఉండదని ఆయన తండ్రి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   7 Dec 2024 6:27 AM GMT
విజయ్ దేవరకొండ పెళ్లి.. తండ్రి ఏంచెప్పారంటే?
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలేషన్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, నిశ్చితార్థం చేసుకోబోతున్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తరచుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాము డేటింగ్ లో ఉన్నామనే విషయాన్ని ఎప్పుడూ ధృవీకరించలేదు. అలా అని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేలా స్ట్రాంగ్ గా ఖండించనూ లేదు. ఇద్దరూ కలిసి హాలిడేకి, పార్టీలకు వెళ్తుండటం.. ఒకే లొకేషన్ లో దిగిన ఫొటోలను వేర్వేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో.. వీరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని అందరూ భావిస్తున్నారు.

ఇటీవల చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ఈవెంట్ లో రష్మిక మందన తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి, తన ప్రియుడి గురించి చెప్పకనే చెప్పింది. 'మీరు ప్రపోజ్ చేసేందుకు రెడీగా ఉన్నారా? ఇండస్ట్రీకి చెందిన వ్యక్తా? బయటి వ్యక్తా?' అంటూ యాంకర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ''అందరికీ తెలిసిన విషయమే కదా.. మీకు కూడా తెలుసు.. కావాలనే అడుగుతున్నారు'' అని రష్మిక తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. రష్మిక ఇక్కడ ఎవరి పేరు చెప్పనప్పటికీ, తన రిలేషన్ షిప్ ను కన్ఫార్మ్ చేసిందని అనుకోవచ్చు.

మరోవైపు ఈ మధ్య ‘సాహిబా’ మ్యూజిక్‌ ఆల్బమ్‌ ప్రమోషన్స్‌లో విజయ్‌ దేవరకొండ తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ పై స్పందించారు. తాను సింగిల్‌ కాదని, రిలేషన్‌లో ఉన్నానని తెలిపారు. కోస్టార్‌తో డేటింగ్‌ చేసినట్లుగా హింట్ ఇచ్చారు. దీంతో వీడీ - రష్మిక మందన్న మధ్య ప్రేమాయణం నిజమేనని అంతా ఫిక్స్ అయ్యారు. త్వరలోనే తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి, పెళ్లి వార్తను చెబుతారేమో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పట్లో విజయ్ వివాహం ఉండదని ఆయన తండ్రి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పెళ్లి పుకార్ల గురించి తండ్రి గోవర్ధన్ దేవరకొండను అడగ్గా.. విజయ్‌ ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా వున్నారని చెప్పారట. గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ జరుగుతోందని, సంక్రాంతి తరువాత మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ఉంటుందని, ఇదే క్రమంలో దిల్ రాజు బ్యానర్ లో సినిమా స్టార్ట్ అవుతుందని, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని గోవర్ధన్ చెప్పినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ జరగనుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై వీడీ టీమ్ క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగలేదు. ఈ నేపథ్యంలో విజయ్ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ''ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం, పెళ్లి జరగడం లేదు. ప్రతీ రెండేళ్లకు ఒకసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లున్నాయి. వాళ్లు నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి రూమర్స్ వింటూనే ఉన్నాను'' అని అన్నారు.

ఇప్పటికైతే విజయ్ దేవరకొండ వెంటనే పెళ్లి లేదా నిశ్చితార్థం చేసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఆరేడు నెలల తర్వాత దీని గురించి ఆలోచిస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి విజయ్ ఫోకస్ అంతా పూర్తిగా కెరీర్‌పైనే ఉంది. రష్మిక మందన్న కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా 'పుష్ప 2' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన రష్మిక.. 'కుబేర' 'సికిందర్' ఛావా' 'రెయిన్‌ బో', 'ది గర్ల్ ఫ్రెండ్' వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇక విజయ్‌-రష్మిక కలిసి గతంలో 'గీత గోవిందం', 'డియర్‌ కామ్రేడ్‌' సినిమాల్లో నటించారు.