Begin typing your search above and press return to search.

కేరళలో రౌడీస్టార్‌ ఏం చేస్తున్నాడో చూడండి!

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఈ ఏడాది 'ఫ్యామిలీ స్టార్‌' తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు.

By:  Tupaki Desk   |   11 Oct 2024 11:54 AM GMT
కేరళలో రౌడీస్టార్‌ ఏం చేస్తున్నాడో చూడండి!
X

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఈ ఏడాది 'ఫ్యామిలీ స్టార్‌' తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు. గీత గోవిందం వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇస్తామంటూ హామీ ఇచ్చిన విజయ్ దేవరకొండ, దిల్‌రాజు లు హామీ ఇచ్చారు. కానీ ఫ్యామిలీ స్టార్‌ ఫలితం తల కిందులు అయింది. అందుకే రౌడీ స్టార్‌ మౌనంగా ఉండి అంతకు మించి అన్నట్లుగా ఒక భారీ సినిమాను చేస్తున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ప్రతి ఒక్కరు వెయిట్‌ చేస్తున్నారు.

దసరా సందర్బంగా విజయ్ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో కీలక అప్‌డేట్‌ ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆ మధ్య సినిమా నుంచి వచ్చిన ఒక పోస్టర్‌ రౌడీ ఫ్యాన్స్‌ అవాక్కయ్యేలా చేసింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌గా ఈ సినిమాలో శ్రీలీల నటిస్తోంది. రష్మిక మందన్న కీలకమైన గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు షేర్‌ చేస్తూ ఉండే విజయ్‌ దేవరకొండ తాజాగా షేర్‌ చేసిన ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ కాఫీ తోటల్లోని రోడ్డు పై జాగింగ్‌ చేస్తూ ఉన్న విజయ్ దేవరకొండ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. మొదటి సారి విజయ్ దేవరకొండ తన జాగింగ్‌ వీడియోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు. జాగింగ్ కి వెళ్తున్న సమయంలో రోడ్డు మీదుగా వెళ్తున్న వారు గుర్తు పట్టి ఫోటోలు తీసుకోవడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సైతం ఇన్‌స్టా ద్వారా విజయ్ షేర్ చేశాడు.

గత సంవత్సరం ఖుషి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఆయన కచ్చితంగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నెట్టింట విజయ్ దేవరకొండ కి మంచి క్రేజ్ ఉంది. అంతే క్రేజ్‌ ఈ సినిమాకి సైతం ఉంది. కనుక వీరి కాంబో మూవీ ఎప్పుడు వచ్చినా కచ్చితంగా మంచి స్పందన దక్కించుకుంటుంది అనే నమ్మంకంతో ఫ్యాన్స్ ఉన్నారు.