Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ హ్యాపీ కానీ.. దేవరకొండ మాత్రం..!

ఐతే ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా ఒక వీడియో సాంగ్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   21 Nov 2024 12:30 PM GMT
ఫ్యాన్స్ హ్యాపీ కానీ.. దేవరకొండ మాత్రం..!
X

ఫ్యామిలీ స్టార్ తో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాను ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చూస్తున్నాడు. జెర్సీ తర్వాత గౌతం తిన్ననూరి తెలుగులో చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సితార బ్యానర్ ఈ సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా ఒక వీడియో సాంగ్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు.

సాహిబా సాంగ్ తో దేవరకొండ తన ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. బాలీవుడ్ ట్రెండ్ కి తగినట్టుగా ఈ ప్రైవేట్ మ్యూజిక్ వీడియో తనకు అంతగా ఇష్టం లేకపోయినా సరే జస్లీన్ రాయల్ కోసమే తాను చేసినట్టు చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. సాహిబా మ్యూజిక్ వీడియోలో విజయ్ దేవరకొండ లుక్స్ చాలా బాగున్నాయి. అంతేకాదు అతనితో జత కట్టిన రాధిక మదన్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

సాహిబా సాంగ్ శ్రోతలను అలరిస్తుండగా కేవలం జస్లీన్ రాయల్ కోసమే ఈ సాంగ్ చేశా తప్ప తనకు మ్యూజిక్ వీడియోల మీద అంత ఆసక్తి లేదని అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఐతే అతని ఫ్యాన్స్ మాత్రం ఈ సాంగ్ తో సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీ స్టార్ తో వారు డిజప్పాయింట్ అవ్వగా సాహిబా సాంగ్ లో విజయ్ లుక్స్ తో సాటిస్ఫైడ్ గా ఉన్నారు. సాహిబా సాంగ్ తో బాలీవుడ్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.

తను తీసిన లైగర్ ని పాన్ ఇండియా రిలీజ్ వదిలి ఆ సినిమాతో కూడా డిజాస్టర్ మూట కట్టుకున్న విజయ్ ఈసారి కొడితే బాక్సాఫీస్ షేక్ అయ్యేలా చేయాలని ఫిక్స్ అయ్యాడు. గౌతం తిన్ననూరితో విజయ్ చేస్తున్న సినిమా 2025 మార్చి 28న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు రవికిరణ్ కోలా కూడా విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలతో పాటు శ్యాం సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ తో విజయ్ దేవరకొండ ఒక పీరియాడికల్ మూవీ ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమాలతో విజయ్ తిరిగి తన ఫ్యాన్స్ కి జోష్ నింపాలని చూస్తున్నాడు.