VD13 కోసం గుర్రపు స్వారి శిక్షణ!
దీంతో ఆ పాత్రకు సంబంధించి ప్రత్యేకమైన హార్స్ రైడింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడుట. విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ పొందుతున్నట్లు తెలిసింది.
By: Tupaki Desk | 25 Dec 2024 2:43 PM GMTవిజయ్ దేవరకొండ 13వ చిత్రం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 1854-78 మధ్య రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే ఆసక్తికర స్టోరీ ఇది. ఇందులో విజయ్ శక్తి వంతమైన యోధుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇంతవరకూ విజయ్ ఇలాంటి పాత్ర పోషించలేదు. దీంతో ఆ పాత్రకు సంబంధించి ప్రత్యేకమైన హార్స్ రైడింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడుట. విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ పొందుతున్నట్లు తెలిసింది.
ఈ సినిమా భారీ కాన్వాస్ పై తెరకెక్కనుంది. భారీ యుద్ద సన్నివేశాలు ఉండబోతున్నాయట. దీనిలో భాగంగా రాహుల్ ఈ ట్రైనింగ్ అవసరమని భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాపై రాహుల్ చాలా కాలంగా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారుట.
సినిమా కోసం భారీ సెట్లు కూడా నిర్మించాల్సి ఉందిట. దానికి సంబంధించిన నిపుణుల బృందం మరోవైపు పనిచేస్తోందిట. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇటీవలే విజయ్-రష్మిక జంటగా ఎయిర్ పోర్టులో చిక్కారు. దీంతో ఇద్దరు ఎక్కడి వెళ్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ తాజా అప్ డేట్ ప్రకారం ఇద్దరు సినిమా కోసమే విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా షూట్ జనవరికల్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ లేని సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయిన వెంటనే రిలీజ్ తో సంబంధం లేకుండా రాహుల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని సమాచారం.