Begin typing your search above and press return to search.

గౌతమ్‌ సినిమా ఫినిషింగ్‌ కోసం రౌడీ ప్రిపరేషన్

గౌతమ్‌తో చేస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. జనవరి లేదా ఫిబ్రవరి వరకు షూటింగ్‌ ముగించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   30 Dec 2024 7:07 AM GMT
గౌతమ్‌ సినిమా ఫినిషింగ్‌ కోసం రౌడీ ప్రిపరేషన్
X

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా ఈ ఏడాది వచ్చిన ఫ్యామిలీ స్టార్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరచింది. అందుకే చాలా ఆలోచించిన తర్వాత గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాడు. ఇతర సినిమాలు లైన్‌లో ఉన్నా గౌతమ్‌ సినిమా పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఆ సినిమాలను మొదలు పెట్టాలని రౌడీ స్టార్‌ భావిస్తున్నాడట. అందుకే ఇప్పటి వరకు చాలా సినిమాలను లైన్‌లో పెట్టాడు కానీ షూటింగ్‌ మాత్రం మొదలు పెట్టలేదు. గౌతమ్‌తో చేస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. జనవరి లేదా ఫిబ్రవరి వరకు షూటింగ్‌ ముగించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి సినిమా కోసం పాట ప్రిపరేషన్‌లో పాల్గొంటున్నాడు. గత రెండు మూడు రోజులుగా పాట కోసం డాన్సర్స్‌తో కలిసి రిహార్సల్స్‌ చేస్తున్నాడట. ఈ మాస్‌ బీట్‌ సాంగ్‌ కి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ వర్క్ చేస్తున్నాడు. పదుల సంఖ్యలో డాన్సర్స్‌తో ఈ పాట ఉంటుంది అంటున్నారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. త్వరలో షూటింగ్‌ చేయబోతున్న పాటలో ఆమె కనిపించబోతుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

జనవరిలో ఆ పాట షూటింగ్‌ చేయనున్నారు. అంతే కాకుండా రెండు కీలయ యాక్షన్‌ సన్నివేశాలను సైతం జనవరిలో చేస్తారు. దాంతో షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయినట్లే అని సమాచారం అందుతోంది. సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరిలో ప్యాచ్‌ వర్క్‌తో సహా పూర్తి చేయనున్నారు. మార్చి 28న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే అదే రోజున పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ డేట్‌ విషయంలో కాస్త కన్ఫ్యూజన్‌ నెలకొంది.

ఇటీవల నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ పవన్‌ మూవీ రాకుంటే తాము ఆ తేదీకి రావాలి అనుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. త్వరలోనే సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేయడంతో పాటు టైటిల్‌ను ప్రకటిస్తామని నిర్మాత అన్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కీలకమైన గెస్ట్‌ రోల్‌లో నటిస్తుంది అనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. సోషల్‌ మీడియాలో మాత్రం పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమాను మార్చిలో విడుదల చేస్తారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ లుక్‌ కి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. కనుక సినిమాపై అంచనాలు పెరిగాయి.