Begin typing your search above and press return to search.

20 ఇయర్స్ బోయ్స్.. 30 ఇయర్స్ బోయ్స్ తేడా చెప్పిన విజయ్ దేవరకొండ..!

రీసెంట్ గా ఒక పబ్లిక్ ఇంటరాక్షన్ లో విజయ్ దేవరకొండ తన వయసు 35 తానింకా సింగిల్ గా ఉన్నానని భావిస్తున్నారా అటూ షాక్ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   21 Nov 2024 9:39 AM GMT
20 ఇయర్స్ బోయ్స్.. 30 ఇయర్స్ బోయ్స్ తేడా చెప్పిన విజయ్ దేవరకొండ..!
X

అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండ తాను సింగిల్ గా లేనని చెప్పి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. అఫ్కోర్స్ విజయ్ సింగిల్ గా లేడు ఆల్రెడీ స్టార్ హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడన్న వార్త ఎప్పటి నుంచో వినిపిస్తుంది కానీ విజయ్ తన నోటి వెంట తాను చెప్పడం విశేషం. రీసెంట్ గా ఒక పబ్లిక్ ఇంటరాక్షన్ లో విజయ్ దేవరకొండ తన వయసు 35 తానింకా సింగిల్ గా ఉన్నానని భావిస్తున్నారా అటూ షాక్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమ అనేది పుడుతుందని అంటున్నాడు విజయ్ దేవరకొండ.

ప్రేమ అనేది తప్పకుండా పుడుతుంది.. యంగ్ గా ఉన్నా వాళ్లు ఇంకాస్త టైం తీసుకోండి. జీవితంలోనే కాదు ఆలోచనలో కూడా ఎదగాల్సి ఉంటుంది. 30 ఏళ్ల ఉన్న బాయ్స్ 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆలోచించిన దాని కన్నా బెటర్ గా ఆలోచిస్తారు. 20 ఏళ్ల వయసులో ఆలోచనలు ఏవి స్థిరంగా ఉండవు.. ఇది నా పర్సనల్ ఎక్స్ పీరియన్స్ అంటూ ఆ టైం కోసం ఎదురుచూడండి.. అంతేకానీ దేన్ని ఫోర్స్ చేయకండి అంటూ తన కామెంట్స్ తో అదరగొట్టాడు.

ఐతే విజయ్ మాట్లాడిన తీరుని బట్టి చూస్తే విజయ్ ప్రేమలో ఉన్నట్టు స్పష్టమైంది. ఐతే ఇంతకీ విజయ్ మనసు గెలిచింది ఎవరు అంటే అందరు చెప్పే పేరు ఒకటే వినిపిస్తుంది. కొన్నాళ్లుగా విజయ్ రష్మిక ప్రేమలో ఉన్నారన్న వార్తలు నేషనల్ వైడ్ గా క్రేజీ న్యూస్ అయ్యింది. లైగర్ ప్రమోషనల్ టైం లో అనన్యా పాండే కూడా విజయ్ లవ్ స్టోరీ గురించి హింట్ ఇచ్చింది.

ఇక ప్రేమని ఎన్నాళ్లని దాచగలం అన్నట్టుగా తాను ప్రేమలో ఉన్న వ్యవహారాన్ని విజయ్ వెల్లడించాడు. ఐతే ఎవరి ప్రేమలో ఉన్నాడు అన్న విషయం మాత్రం సస్పెన్స్ లో పెట్టాడు. విజయ్ ప్రేమించే అమ్మాయి రష్మికే కదా అని అందరు చాటింపు వేస్తుంటే విజయ్ కన్ ఫర్మ్ చేయనిదే అలా చెప్పడం కష్టమని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్ చెప్పాడు.

విజయ్ కామెంట్స్ వల్ల రష్మిని రౌండప్ చేయడం కామనే. ఐతే విజయ్ ఓపెన్ అవ్వకపోయినా అవతల వ్యక్తి నుంచైనా ఏదైనా లీక్స్ వస్తే బెటర్ అని అంటున్నారు ఆడియన్స్. రష్మిక కూడా ప్రేమ గురించి ఓపెన్ అవుతుందా.. ఇంతకీ ప్రేమ మీద ఆమె అభిప్రాయం ఏంటన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఉత్సాహ పడుతున్నారు.