Begin typing your search above and press return to search.

కింగ్ డమ్ అంటే చాలు డ్యూటీ ఎక్కేస్తున్న నిర్మాత..!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో ఒకరైన సితార ఎంటర్టైన్మెంట్ నాగ వంశీ ప్రతి సినిమా విషయంలో తన నమ్మకాన్ని వెల్లడిస్తూ ఆడియన్స్ లో అంచనాలు పెంచుతున్నారు.

By:  Tupaki Desk   |   22 March 2025 5:30 AM IST
కింగ్ డమ్ అంటే చాలు డ్యూటీ ఎక్కేస్తున్న నిర్మాత..!
X

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో ఒకరైన సితార ఎంటర్టైన్మెంట్ నాగ వంశీ ప్రతి సినిమా విషయంలో తన నమ్మకాన్ని వెల్లడిస్తూ ఆడియన్స్ లో అంచనాలు పెంచుతున్నారు. త్వరలో ఆయన నిర్మాణంలో రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగవంశీ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ గురించి మరోసారి ప్రస్తావించారు. అదేంటో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ గురించి నాగ వంశీ ఎప్పుడు చెప్పినా సినిమా మీద భారీ హైప్ వచ్చేలా చేస్తున్నారు.

గౌతం తిన్ననూరి కథ చెప్పినప్పుడే ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని అనుకున్నామని. కథే రెండు భాగాలు కోరిందని అందుకే కింగ్ డమ్ సర్ ప్రైజ్ చేస్తుందని అన్నారు. విజయ్ దేవరకొండ గౌతం ఇద్దరు ఆ సినిమాకు బెస్ట్ ఎఫర్ట్ పెడుతున్నారని అన్నారు. కింగ్ డమ్ సినిమాపై నాగ వంశీ చేస్తున్న కామెంట్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

గౌతం తిన్ననూరి జెర్సీ సినిమా తర్వాత చేస్తున్న సినిమాగా కింగ్ డమ్ మీద అంచనాలు ఉన్నాయి. ఐతే ఈ సినిమా టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఇది పెద్ద స్కేల్ మూవీగా రాబోతుందని అర్ధమవుతుంది. ఇక సినిమా ఓ పక్క షూటింగ్ జరుగుతుంటే నిర్మాత నాగ వంశీ బయట ఇంటర్వ్యూస్ లో ఏదో ఒక విధంగా కింగ్ డం మీద హైప్ ఎక్కిస్తున్నాడు.

సినిమా గురించి ఆడియన్స్ లో చర్చ జరిగేలా చేయడం పెద్ద టాస్క్. కానీ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ గురించి నాగ వంశీ చేస్తున్న డ్యూటీ చూస్తుంటే సినిమాకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టేలా ఉంది. ఆల్రెడీ టీజర్ తోనే సినిమా లెక్క ఏంటన్నది చూపించగా ఇక సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెబుతున్నారు.

విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మే నెలలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న కింగ్ డమ్ పై నిర్మాత కాన్ఫిడెన్స్ చూస్తే రౌడీ హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అనేలా ఉంది. కింగ్ డమ్ నుంచి టీజర్ రిలీజ్ చేసినా అందులో పార్ట్ 1 అని మెన్షన్ చేయలేదు. ఐతే మేకర్స్ ఈ సినిమా రెండు భాగాలు అన్నది అనౌన్స్ చేసే ప్రాసెస్ ని కూడా ఏదో పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నారని అర్థమవుతుంది.