లైగర్ తర్వాత విజయ్ మరోసారి
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్‌డమ్ అనే యాక్షన్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 26 March 2025 6:17 AMరౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్‌డమ్ అనే యాక్షన్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. అనౌన్స్‌మెంట్ నుంచే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా మొన్నీ మధ్య రిలీజ్ చేసిన టీజర్ తో ఒక్కసారిగా కింగ్‌డమ్ పై అంచనాలను భారీగా పెంచేసింది.
మే 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా నాగవంశీ ఓ ఇంటర్య్వూలో విజయ్ దేవరకొండతో చేస్తున్న కింగ్‌డమ్ మూవీ గురించి మాట్లాడాడు.
కింగ్‌డమ్ సినిమాకు విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ గా కొంత డబ్బే తీసుకుంటున్నారని, సినిమా రిలీజై, బ్రేక్ ఈవెన్ అయ్యి, లాభాలు వచ్చాక అందులో కొంత షేర్ ను తీసుకోనున్నాడని వంశీ వెల్లడించాడు. హీరోలు ఇలా ఆలోచించి ముందడుగు వేస్తే సినిమాకు భారీ మొత్తంగా పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉంటుందని నాగవంశీ అన్నాడు.
గతంలో కూడా విజయ్ ఈ ఫార్ములాను ఒకసారి ఫాలో అయ్యాడు. తన మొదటి పాన్ ఇండియన్ ఫిల్మ్ లైగర్ కోసం కూడా విజయ్ ఇలానే చేశాడు. లైగర్ మూవీ షూటింగ్ టైమ్ లో బడ్జెట్ ఇష్యూ రావడంతో తన రెమ్యూనరేషన్ లో ఎక్కువ మొత్తాన్ని విజయ్ తిరిగి ఇచ్చి షూటింగ్ కు బ్రేక్ పడకుండా చేసిన సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు కింగ్‌డమ్ సినిమాకు కూడా విజయ్ అలానే చేస్తున్నాడు. కాకపోతే లైగర్ కు ముందే రెమ్యూనరేషన్ తీసుకుని తర్వాత వెనక్కి ఇచ్చాడు. ఇప్పుడలా కాకుండా కొంత మొత్తమే తీసుకుని, మిగిలింది లాభాలొచ్చాక తీసుకుంటానని చెప్పాడట విజయ్.
గత కొన్ని సినిమాలుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విజయ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన ఆశలన్నీ కింగ్‌డమ్ పైనే పెట్టుకున్నాడు విజయ్. ఇక సినిమా విషయానికొస్తే భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.