కింగ్ డమ్ గురి తప్పేదేలేదంతే..!
ఫ్యామిలీ స్టార్ తో టార్గెట్ మిస్ అవ్వడంతో రాబోతున్న కింగ్ డమ్ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు విజయ్ దేవరకొండ.
By: Tupaki Desk | 26 Feb 2025 1:30 AM GMTఫ్యామిలీ స్టార్ తో టార్గెట్ మిస్ అవ్వడంతో రాబోతున్న కింగ్ డమ్ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు విజయ్ దేవరకొండ. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కింగ్ డమ్ సినిమా టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు. టీజర్ తోనే దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. కింగ్ డమ్ కథపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా సినిమా విజయ్ మార్క్ మాస్ ట్రీట్ అందించబోతుందని అర్థమవుతుంది.
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాలో ఆడియన్స్ కు కావాల్సిన అంశాలన్నీ ఉన్నట్టు తెలుస్తుంది. శాంపిల్ గా వచ్చిన టీజర్ లోనే ఇది చాలా పెద్ద కథ అన్నట్టుగా చెప్పిన డైరెక్టర్ విజయ్ దేవరకొండ ఎనర్జీని ఫుల్లుగా వాడేసినట్టు తెలుస్తుంది. విజయ్ కూడా కొన్నాళ్లుగా సరైన సినిమా పడక కెరీర్ లో వెనకపడి ఉన్నాడు. అందుకే కింగ్ డమ్ తో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
జెర్సీ తో తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రేక్షకులను అలరించిన గౌతం తిన్ననూరి నెక్స్ట్ కింగ్ డమ్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఐతే కింగ్ డమ్ వరల్డ్ చాలా భారీగా ఉండబోతుందని అర్థమవుతుంది. అందుకే ఈ సినిమా నిర్మాత నాగ వంశీ సినిమా గురించి ఎప్పుడు చెప్పినా ఒక రేంజ్ లో అంచనాలు పెరిగేలా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా కింగ్ డమ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మరోసారి 100 కోట్ల గురి పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
దేవరకొండకు ఉన్న యూత్ ఫాలోయింగ్ కి కరెక్ట్ సినిమా పడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. కానీ ఎందుకో అలాంటి సినిమా పడటానికి లేట్ అవుతూ వచ్చింది. ఐతే కింగ్ డమ్ టీజర్ చూసిన ఫ్యాన్స్ ఇది కదా అసలైన సినిమా ఇన్నాళ్లు దీని కోసమే కదా ఎదురుచూస్తుంది అని అనుకున్నారు. మరి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కోరుతున్న సూపర్ హిట్ ఈ సినిమా ఇస్తుందా లేదా అన్నది చూడాలి. విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నారని తెలిసిందే.