Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’.. పవర్‌ఫుల్ క్యాస్టింగ్ సర్‌ప్రైజ్!

విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కింగ్‌డమ్’ పై అంచనాలు రోజు రోజుకూ మరింత పెరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 March 2025 11:17 PM IST
విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’.. పవర్‌ఫుల్ క్యాస్టింగ్ సర్‌ప్రైజ్!
X

విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కింగ్‌డమ్’ పై అంచనాలు రోజు రోజుకూ మరింత పెరుగుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ డిఫరెంట్ జానర్‌లో రూపొందుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్స్ ట్రెండ్‌లో ఉండగా, ఈ సినిమా కూడా అదే రూట్‌లో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా, బిగ్ స్కేల్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు, మేకింగ్ పరంగా అత్యుత్తమ క్వాలిటీని అందించేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నాయి. విజువల్ ట్రీట్‌గా సినిమాను తీర్చిదిద్దడానికి గౌతమ్ తిన్ననూరి గ్రాండ్ మేకింగ్‌కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కథ నేటివిటీతో నిండిపోయి ఉండేలా, ప్రధాన పాత్రలు కూడా డిఫరెంట్ షేడ్స్‌లో ఉండేలా ప్లాన్ చేశారట. ఇదిలా ఉంటే, ఈ సినిమా మ్యూజిక్ కోసం అనిరుధ్ రవిచందర్ పని చేస్తుండటం మరో హైలైట్.

తాజాగా ‘కింగ్‌డమ్’లో కీలక పాత్రలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్నాడనే వార్త వినిపిస్తోంది. మాస్, క్లాస్ మూవీల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్, ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు అన్నయ్య పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ క్యారెక్టర్ ఓ బలమైన ఎమోషనల్ కోర్‌ను కలిగి ఉంటుందని టాక్. గతంలో సత్యదేవ్ విలక్షణమైన పాత్రలు పోషించినా, ఇది పూర్తి స్థాయిలో సినిమా ప్లాట్‌ను ముందుకు తీసుకెళ్లే కీలకమైన రోల్‌గా ఉండబోతుందని చెబుతున్నారు.

విజయ్‌తో ఆయన కెమిస్ట్రీ, తెరపై వారి యాక్షన్ మోమెంట్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందట. సత్యదేవ్ ఎంట్రీతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ లుక్, సినిమాలో ఆయన పవర్‌ఫుల్ షేడ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగా, ఇప్పుడు క్యాస్టింగ్ విషయమై మరిన్ని అంచనాలు పెరిగాయి. పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో, యుద్ధం నేపథ్యంలో కుటుంబ బంధాలు, మానవ సంబంధాల అంశాలు కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సత్యదేవ్ పాత్ర సెంటిమెంట్‌కు బలాన్ని చేకూర్చేలా ఉండే అవకాశం ఉంది. కింగ్‌డమ్ మే 30న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మేకర్స్ త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిలిచే ఈ ప్రాజెక్ట్, ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతుందన్న నమ్మకం ఉంది. మరి సత్యదేవ్ పాత్ర సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.