కుంభమేళాలో స్నేహారెడ్డి & ఫ్యామిలీతో దేవరకొండ
విజయ్ దేవరకొండ ఇటీవలే ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా మహాకుంభ్ 2025లో పూజలు ఆచారాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Feb 2025 10:03 AM GMTవిజయ్ దేవరకొండ ఇటీవలే ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా మహాకుంభ్ 2025లో పూజలు ఆచారాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తనతో పాటు తల్లి మాధవి దేవరకొండ, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సహా సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డితో విజయ్, అతడి కుటుంబం కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విజయ్ ఒక సాధారణ భక్తుడిలా మెడలో పూల దండతో కనిపించగా, ఇతరులు సాధారణ దుస్తుల్లో కనిపించారు. స్నేహా రెడ్డి సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. దేవరకొండ ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళా నుంచి ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. గంగ, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో తాను తన తల్లి పవిత్ర స్నానం చేస్తున్న ఫోటోలను విజయ్ పోస్ట్ చేశారు. 2025 కుంభమేళా - మన పూర్వీకుల మూలాలను గౌరవించడానికి, కనెక్ట్ అవ్వడానికి ఒక ప్రయాణం. నా ప్రియమైన గ్యాంగ్ తో ఇక్కడికి వచ్చానని విజయ్ అన్నారు. దేవరకొండ తన మూలాలతో కనెక్ట్ అవ్వడానికి, పెద్దలను గౌరవించడానికి ఒక మార్గంగా దీనిని అభివర్ణించారు. త్రివేణి సంగమంలో స్నానం చేసిన అనంతరం విజయ్ మరో ఆధ్యాత్మిక ప్రదేశం కాశీని కూడా సందర్శించాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి విజయ్ `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోని పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా `కింగ్‌డమ్`లో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సానుకూల బజ్‌ను సృష్టిస్తోంది. హిందీ, తెలుగు, తమిళ భాషలలో వరుసగా రణబీర్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, సూర్య నేపథ్యంలో వాయిస్ ని అందించారు.
`కింగ్‌డమ్` వార్ నేపథ్యంలో హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా కథతో రూపొందుతోంది. తన ప్రజలను రక్షించడానికి బయల్దేరే రక్షకుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.