Begin typing your search above and press return to search.

దేవరకొండ.. కూల్ స్టిల్ లో కిర్రాక్ లుక్స్

తాజాగా GQ ఇండియా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కనిపించాడు. “టీ బ్రేక్ లేదా కాఫీ బూస్ట్? మీరు ఏ టీమ్‌లో ఉన్నారు?” అంటూ అతడి ఫోటోను షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   28 Dec 2024 9:30 PM GMT
దేవరకొండ.. కూల్ స్టిల్ లో కిర్రాక్ లుక్స్
X

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో యూత్‌కు ఐకాన్‌గా మారిన నటులలో ఒకరు. విజయ్ తన సింప్లిసిటీ, వినూత్న స్టైల్ కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. గ్లోబల్ స్టార్‌గా ఎదగడానికి తన ప్రత్యేకమైన లైనప్ తో సిద్దమవుతున్న విజయ్ దేవరకొండ తాజాగా GQ ఇండియా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కనిపించాడు. “టీ బ్రేక్ లేదా కాఫీ బూస్ట్? మీరు ఏ టీమ్‌లో ఉన్నారు?” అంటూ అతడి ఫోటోను షేర్ చేశారు.

విజయ్ ఈ ఫోటోలో తన స్టైల్‌ను మరోసారి ప్రదర్శించాడు. పింక్ కలర్ బీనీ, క్రీమ్ స్వెట్‌షర్ట్, కాఫీ మగ్గుతో కూల్‌గా కూర్చున్న విజయ్ న్యాచురల్ లుక్‌లో కనిపించారు. సాధారణమైన లుక్‌లోనూ అతని స్టైల్ అండ్ యాటిట్యూడ్ మాస్ తరహాలో ఉండటంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూత్‌తో పాటు స్టైల్ ప్రియులందరూ ఈ ఫోటోపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా కీలకమైన దశలో ఉన్నాడు. చివరగా అతని నుంచి వచ్చిన లైగర్ - ఖుషి సినిమాలు అనుకున్నంతగా సక్సెల్ కాలేకపోయాయి. ఇక నెక్స్ట్ ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. లైనప్ ప్రాజెక్టులలో 'VD12' ప్రధానమైనది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుందని సమాచారం.

విజయ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదే కాదు, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'VD14' కూడా విజయ్ కెరీర్ కు చాలా స్పెషల్. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తోందని టాక్. ఈ రెండు చిత్రాలతో పాటు, రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కనున్న 'VD15' పై మంచి హైప్ ఉంది.

ఎందుకంటే ప్రతీ సినిమా దేనికదే ప్రత్యేకంగా ఉండనున్నాయి. నెవ్వర్ బిఫోర్ అనేలా డిఫరెంట్ జానర్స్ లో కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న 'VD16' ప్రాజెక్ట్స్ కూడా విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. విజయ్ తన కెరీర్‌లో విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఈ ప్రాజెక్ట్స్‌తో పాటు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్ లతో కూడా విజయ్ భవిష్యత్ లో వర్క్ చేయనున్నట్లు టాక్.