రష్మికతో డేటింగ్!.. ఫైనల్ గా విజయ్ ఏమన్నాడంటే..
అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ.. రష్మికతో తాను డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న రూమర్స్ పై స్పందించారు.
By: Tupaki Desk | 19 Dec 2024 7:13 AM GMTటాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై వారిద్దరి నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ.. పలు సందర్భాల ద్వారా విజయ్, రష్మిక ఒక్కటి కానున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అంతే కాకుండా దేవరకొండ ఫ్యామిలీతో కూడా రష్మిక చాలా క్లోజ్ గా ఉంటోంది. వెనుస్వామి కూడా ఈ జంట బంధంపై ఒపెన్ గానే క్లారిటీ ఇచ్చారు.
అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ.. రష్మికతో తాను డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న రూమర్స్ పై స్పందించారు. ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాన్ని సమయం వచ్చినప్పుడు చాలా సంతోషంగా చెబుతానని అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.
డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న రూమర్లపై సమయం వచ్చినప్పుడు క్లియర్ గా రెస్పాండ్ అవుతానని విజయ్ తెలిపారు. అందరితో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు.. ఆ విషయం తప్పకుండా బయటపెడతానని అన్నారు. అన్నింటికీ ఒక రీజన్ ఉండాలని, సమయం రావాలని, అప్పుడు హ్యాపీగా షేర్ చేసుకుంటానని చెప్పారు.
నటుడిని కాబట్టి తన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుందని తెలిపారు. అయితే దానిని కూడా తాను ప్రొఫెషన్ లో భాగంగా భావిస్తానని తెలిపారు. ఎక్కువగా ఒత్తిడిగా తీసుకోనని అన్నారు. ఎప్పుడూ వార్తలను అలాగే చూస్తానని చెప్పారు. ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించానని పేర్కొన్నారు.
ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. విజయ్ కామెంట్స్ బట్టి డేటింగ్ లో ఉన్నారో లేదో తెలియడం లేదని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కానీ రష్మిక రీసెంట్ గా చేస్తున్న కామెంట్స్ ప్రకారం లవ్ లో ఉన్నట్లు అనిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి కన్ఫ్యూజన్ గా ఉందని చెబుతున్నారు.
ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే.. 2024లో ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత కల్కి 2898 ఏడీలో కనిపించారు. ఇప్పుడు VD 12తో బిజీ ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆ సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు విజయ్.