Begin typing your search above and press return to search.

విజయ్ - పరశురామ్.. టార్గెట్ ఫిక్స్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   16 July 2023 4:24 AM GMT
విజయ్ - పరశురామ్.. టార్గెట్ ఫిక్స్
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సమంత ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ప్యూర్ లవ్ స్టొరీతో శివ నిర్వాణ ఖుషి మూవీని ఆవిష్కరించారు. దీని తర్వాత విజయ్ దేవరకొండ రెండు సినిమాలని కమిట్ అయిన సంగతి తెలిసిందే.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. దీంతో పాటు పరశురామ్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ఒక మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.

దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. మృణాల్ ఠాకూర్ కూడా ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక షూటింగ్ స్టార్ట్ అయినట్లుగా ఒక పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా పోస్టర్ లో కన్ఫర్మ్ చేశారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు. దిల్ రాజు కి సంక్రాంతి సీజన్ భాగా కలిసివస్తూ ఉంటుంది. ఆ టైమ్ లో రిలీజ్ అయిన సినిమాలతో దిల్ రాజు చాలా వరకు సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో VD 11 సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

పరశురామ్, విజయ్ కాంబోలో వచ్చిన గీతాగోవిందం తరహాలో ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ని పరశురామ్ ఎంపిక చేసుకొని విజయ్ దేవరకొండతో మూవీ చేస్తూ ఉండటం కూడా కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు.