Begin typing your search above and press return to search.

VD 14 కూడా పెద్ద ప్లానింగేనా..?

ఐతే రాహుల్ తో విజయ్ చేసే సినిమా మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   6 Jan 2025 8:30 AM GMT
VD 14 కూడా పెద్ద ప్లానింగేనా..?
X

విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ పవర్ ఫుల్ పోలీస్ గా నటించనున్నాడు. ఐతే ఈ సినిమా తర్వాత విజయ్ రెండు భారీ ప్రాజెక్ట్ లను చేస్తున్నాడు. అందులో ఒకటి రవికిరణ్ కోలా డైరెక్షన్ లో వస్తుంటే మరొకటి శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో వస్తుంది. ఈ రెండు సినిమాలు ఈ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లేలా ఉన్నాయి.

విజయ్ దేవరకొండ 12వ సినిమా మార్చిలో రిలీజ్ అంటున్నారు. సినిమా మార్చి నుంచి సమ్మర్ వచ్చే ప్లాన్ ఉంది. ఐతే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా సినిమా రెండు భాగాల్లో రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఐతే ఈ సినిమా తర్వాత రవికిరణ్ కోలా డైరెక్షన్ లో చేసే సినిమా కూడా ఉంది. ఐతే రాహుల్ తో విజయ్ చేసే సినిమా మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

రాహుల్ సంకృత్యన్ తో విజయ్ దేవరకొండ ఆల్రెడీ టాక్సీవాలా సినిమా చేశాడు. ఇక ఇప్పుడు మళ్లీ అతనితో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఐతే ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ రాహుల్ సినిమా పీరియాడికల్ మూవీగా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.

శ్యామ్ సింగ రాయ్ తో తన స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ ఏంటన్నది ప్రూవ్ చేసుకున్న రాహుల్ ఈసారి పీరియాడికల్ కథతో నెక్స్ట్ లెవెల్ తో వస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తీసే ప్లాన్ లో ఉన్నారట. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఈ సినిమా మొదలు కాబోతుందని తెలుస్తుంది. విజయ్, రాహుల్ కాంబో కంప్లీట్ గా సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లేలా కథ సిద్ధం చేశారని తెలుస్తుంది. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ ప్లానింగ్ చూసి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. విజయ్ నుంచి ఇక మీదట వచ్చే సినిమాలన్నీ దాదాపు పాన్ ఇండియా రిలీజ్ ఉంటాయని తెలుస్తుంది.