VD.. రష్మిక.. ఎందుకు ఈ లేట్..?
ఫ్యాన్స్ ని రౌడీస్ అని ప్రేమగా పిలిచే విజయ్ దేవరకొండ తన రౌడీ ఫ్యాన్స్ ని అలరించేందుకు ఈసారి సరికొత్త ప్లానింగ్ తో వస్తున్నాడు.
By: Tupaki Desk | 1 March 2025 2:30 AM GMTఫ్యాన్స్ ని రౌడీస్ అని ప్రేమగా పిలిచే విజయ్ దేవరకొండ తన రౌడీ ఫ్యాన్స్ ని అలరించేందుకు ఈసారి సరికొత్త ప్లానింగ్ తో వస్తున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్ డం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత రవి కిరణ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ ఆడిషన్ ఈమధ్యనే పూర్తి చేశారు. ఇక నెక్స్ట్ టాక్సీవాలా తో హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యన్ తో కూడా విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుందని టాక్. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న అయితే బాగుంటుందని అనుకుంటున్నారట.
విజయ్ దేవరకొండ రష్మిక ఇప్పటివరకు గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాల్లో నటించారు. గీతా గోవిందం హిట్ తో వారి మధ్య స్నేహం బలపడగా అప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉన్నారు. ఐతే కొందరు వాళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని అంటున్నా వాళ్లు మాత్రం పట్టించుకోవట్లేదు. ఐతే విజయ్ దేవరకొండ రష్మిక ఆఫ్ స్క్రీన్ రిలేషన్ సంగతి ఏమో కానీ ఇద్దరు కలిసి ఆన్ స్క్రీన్ ఎప్పుడు నటిస్తారన్న ఆసక్తి ఆడియన్స్ లో ఉంది.
రష్మిక ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ఛాన్స్ లు అందుకుంటూ అదరగొట్టేస్తుంది. విజయ్ దేవరకొండ సినిమా అంటే కచ్చితంగా అమ్మడు డేట్స్ అడ్జెస్ట్ చేస్తుంది. ఐతే వారి మధ్య ఉన్న బాండింగ్ కి తగినట్టుగా ఈసారి సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఆలోచనతో ఉన్నారట. అందుకే విజయ్ రష్మిక కలిసి సినిమా చేయడానికి టైం తీసుకుంటున్నారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం రష్మిక లక్ ఫ్యాక్టర్ తమ అభిమాన హీరోకి కావాలని ఆశిస్తున్నారు. ఐతే ఇద్దరు కలిసి నటించే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అది ఏ సినిమాతో కుదురుతుందో చూడాలి.