ఫిబ్రవరితో ఆయన ముగించేస్తాడా?
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Jan 2025 6:30 AM GMTవిజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ కి వెళ్లి చాలా కాలమవుతుంది. ఇంత వరకూ షూటింగ్ పూర్తవ్వలేదు. చిత్రీకరణ అంతా నెమ్మదిగా సాగుతోంది. స్పై కంటెంట్ కావడంతో గౌతమ్ విదేశాల్లో ఎలాంటి షూటింగ్ ప్లాన్ చేయలేదు. ఇండియాలోనే షూట్ అంతా ముగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తయిందట. బ్యాలెన్స్ షూట్ చివరి షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో మొదల వుతుందని సమాచారం. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ ముగిస్తారుట. ఇది భారీ యాక్షన్ షెడ్యూల్ అని సమాచారం. అందుకోసం విజయ్ ప్రత్యేకంగా సన్నధం అవుతున్నాడుట. కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీ కరించాల్సి ఉందిట. దీనిలో భాగంగా విజయ్ వాటి కోసం కొంత శిక్షణ తీసుకుంటున్నాడట.
అలాగే సినిమా రిలీజ్ తేదీ ఫిక్సైనట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులు పూర్తి చేసి మేలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారుట. మే 30న రిలీజ్ తేదీగా పరిశీలిస్తున్నారుట. కుదిరితే అంతకు ముందే రిలీజ్ చేయాలని....లేదంటే 30న పక్కాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ సినిమా టైటిల్ ఇంతవరకూ ప్రకటించలేదు.
వీలైనతం త్వరగా టైటిల్ కూడా ఫిక్స్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. అప్ డేట్స్ తో పాటు ప్రచారం కూడా ఎక్కడా జరగలేదు. దీంతో ఈ సినిమా ఉందా? అన్న సందేహం కూడా చాలా మందిలో ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న `కూలీ` చిత్రం మే 31న రిలీజ్ అవుతుంది. లొకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియాలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. విజయ్ సినిమా కూడా పాన్ ఇండియాలోనే రిలీజ్ అవుతుంది. అందుకే గౌతమ్ తన సినిమాని ఒక్క రోజు ముందుగానే ప్లాన్ చేస్తున్నారు.