VD12.. ఈ క్రేజీ న్యూస్ నిజమేనా..?
ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.
By: Tupaki Desk | 8 Feb 2025 9:30 PM GMTఫ్యామిలీ స్టార్ రిజల్ట్ తో షాక్ తిన్న విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా గురి తప్పకూడదు అని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు. విజయ్ దేవరకొండ 12వ సినిమాగా వస్తున్న ఈ మూవీని గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. మిస్టర్ బచ్చన్ భామ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఐతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో విజయ్ దేవరకొండ ఒక్కడు కాదు ఇద్దరని టాక్ నడుస్తుంది. సాధారణంగా ఇద్దరు హీరోలు అంటే తండ్రి కొడుకులుగానే చేస్తారు. సో తండ్రిని దెబ్బ తీసిన వారి మీద పగ తీర్చుకోవడం లాంటివి మనం చూసేశాం. ఐతే విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ యాక్షన్ సినిమాగా ఇది వస్తుందని తెలుస్తుంది.
ఇప్పటికే నాగ వంశీ ఈ సినిమాపై అంచనాలు పెంచేలా నెక్స్ట్ లెవెల్ అంటూ చెప్పుకొచ్చాడు. VD 12 సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారన్న టాక్ నడుస్తుంది. దానికితోడు ఇప్పుడు సినిమాలో విజయ్ దేవరకొండ డ్యుయల్ రోల్ అనే వార్త వస్తుంది. అదే నిజమైతే మాత్రం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఈసారి ఫుల్ మీల్స్ పక్కా అన్నట్టే అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ సినిమా సూపర్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఫ్యాన్స్ కూడా విజయ్ సక్సెస్ కొడితే చూడాలని అనుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి ఈసారి పక్కా హిట్ ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమా రిలీజ్ ను మార్చి ఎండింగ్ అని ముందు చెప్పినా ఇప్పుడు ఆ డేట్ కి రావడం కష్టమే అని తెలుస్తుంది. VD 12 టీజర్ త్వరలోనే రాబోతుంది. ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా పూర్తి కాగానే విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలాతో ఒక సినిమా రాహుల్ సంకృత్యన్ తో ఒక మూవీ ప్లాన్ చేశాడు. రాహుల్ తో సినిమా పీరియాడికల్ ప్రాజెక్ట్ గా వస్తుందని తెలుస్తుంది. ఆ సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని టాక్.