Begin typing your search above and press return to search.

విజయ్ GOAT తెలుగు టార్గెట్.. చిన్నదే కానీ..

ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం GOAT మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

By:  Tupaki Desk   |   4 Sep 2024 5:01 AM GMT
విజయ్ GOAT తెలుగు టార్గెట్.. చిన్నదే కానీ..
X

తుపాకీ మూవీ తర్వాత విజయ్ సినిమాలు తెలుగులో రెగ్యులర్ గా రిలీజ్ అవుతున్నాయి. మార్కెట్ కూడా పెరిగింది. అతని సినిమాలకి తెలుగు ప్రేక్షకులు నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే సినిమా సినిమాకి విజయ్ మార్కెట్ వేల్యూ టాలీవుడ్ లో కూడా పెరుగుతూ వెళ్తోంది. ఇది స్పష్టంగా ఆయన సినిమాల బిసినెస్ లలో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం GOAT మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో స్పై థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, వైభవ్ లాంటి స్టార్ యాక్టర్స్ కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు. విజయ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో తండ్రి, కొడుకులుగా కనిపించబోతున్నాడు.

సైన్స ఫిక్షన్ ఎలిమెంట్స్ ని ఈ చిత్రం కోసం వెంకట్ ప్రభు ఉపయోగించుకున్నారంట. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ పర్వాలేదనే టాక్ తెచ్చుకున్న సినిమాపై హైప్ మాత్రం క్రియేట్ చేయలేదు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియోతో పోల్చుకుంటే GOAT మూవీపైన బజ్ తక్కువ ఉంది. అయితే తెలుగులో విజయ్ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ ఈ చిత్రంపై జరిగింది.

తెలుగు రాష్ట్రాలకి సంబందించిన థీయాయాట్రికల్ బిజినెస్ 21 కోట్ల వరకు ఉంది. ఇది పెద్ద టార్గెట్ అయితే కాదు. తెలుగులో 22 కోట్ల షేర్ ని అందుకుంటేనే GOAT మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మూవీపై పెద్దగా బజ్ లేకపోవడంతో ఓపెనింగ్స్ ఎన్ని కోట్లు వస్తాయనేది ఎక్స్ పెక్ట్ చేయలేకపోతున్నారు. మౌత్ టాక్ ద్వారానే సినిమా జనాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.

మూవీకి హిట్ టాక్ వస్తే మాత్రం 22 కోట్ల షేర్ ని ఈజీగా అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఏవరేజ్ టాక్ వచ్చిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ కాకపోవచ్చు. అయితే GOAT సినిమాకి పెద్దగా కాంపిటేషన్ లేదు. 35 చిన్న కథ కాదు, మత్తు వదలరా2, భలే ఉన్నాడే లాంటి చిన్న సినిమాలు సెప్టెంబర్ 6, 7 తేదీలలో రిలీజ్ అవుతున్నాయి.

ఈ సినిమాలు విజయ్ GOAT సినిమాకి ఎంత పోటీ ఇస్తాయనేది చెప్పలేం. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం చిన్న సినిమాలు GOAT కలెక్షన్స్ ని ఆపలేకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ కెరియర్ లో గత కొన్నేళ్ల నుంచి వస్తోన్న సినిమాల బిజినెస్ చూసుకుంటే గ్రాడ్యుయల్ పెరుగుతూ ఉండటం విశేషం.

The GOAT - 21CR

లియో - 16CR

వారసుడు - 16CR

బీస్ట్ - 10CR

మాస్టర్ - 8CR

విజిల్ - 10.25CR

సర్కార్ - 7.50CR