Begin typing your search above and press return to search.

గోట్ Vs ఇబ్బని.. పెద్ద రచ్చే!!

వేరే లాంగ్వేజ్ మూవీ.. దానికి తోడు నెగిటివ్ టాక్ వచ్చింది.. అలాంటి విజయ్ గోట్ సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడంపై కన్నడ నెటిజన్లు మండిపడుతున్నారు.

By:  Tupaki Desk   |   7 Sep 2024 8:13 AM GMT
గోట్ Vs ఇబ్బని.. పెద్ద రచ్చే!!
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్- గోట్ వర్సెస్ శాండిల్ వుడ్ సినిమా ఇబ్బని తబ్బిత ఇల్లెయాలి.. అన్నట్లు ఇప్పుడు పరిస్థితి తలెత్తింది! రెండు రోజులుగా ఆ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కన్నడిగులు ఆ మ్యాటర్ పై పెట్టిన కొన్ని వందల పోస్టులు కనిపిస్తున్నాయి. ఇంకా ఎన్నాళ్ళు ఇలా అంటూ అనేక మంది కామెంట్లు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే?

విజయ్ దళపతి మూవీ గోట్.. వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఆ సినిమా.. మిక్స్ డ్ టాక్ అందుకుంది. ఓపెనింగ్స్ బాగానే ఉన్నా.. మౌత్ టాక్ పాజిటివ్ గా లేకపోవడంతో వసూళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు ఇబ్బని తబ్బిత ఇల్లెయాలి మూవీ కూడా రిలీజ్ అయింది. విహాన్ గౌడ, అంకిత అమర్ నటించిన ఆ సినిమాను చంద్రజిత్ డైరెక్ట్ చేశారు.

స్టార్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టి.. నిర్మించిన లవ్ ఎంటర్టైనర్ ఇబ్బని తబ్బిత ఇల్లెయాలి మంచి రెస్పాన్స్ అందుకుంది. క్లాసిక్ మూవీ అని సినీ ప్రియులు చెబుతున్నారు. అయితే కన్నడ చిత్రమే అయినా.. ఇబ్బని తబ్బిత ఇల్లెయాలికు బెంగళూరులో కావాల్సిన సంఖ్యలో థియేటర్లు ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ థియేటర్లు, మల్టీప్లెక్సుల్లోని షోలు.. విజయ్ గోట్ మూవీకి ఇచ్చేశారని కొందరు శాండల్ వుడ్ ఆడియన్స్ చెబుతున్నారు.

వేరే లాంగ్వేజ్ మూవీ.. దానికి తోడు నెగిటివ్ టాక్ వచ్చింది.. అలాంటి విజయ్ గోట్ సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడంపై కన్నడ నెటిజన్లు మండిపడుతున్నారు. సూపర్ క్లాసిక్ గా నిలిచిన ఇబ్బని తబ్బిత ఇల్లెయాలి చిత్రానికి తక్కువ స్క్రీన్స్ కేటాయించడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో యాప్ లో రెండు సినిమాలు ఆడుతున్న థియేటర్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసి పోస్ట్ చేస్తున్నారు.

పరభాషా చిత్రాలకు ఇచ్చిన ఇంపార్టెన్స్.. స్వభాష మూవీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. కన్నడ సినిమాలకు కచ్చితంగా ఫిక్స్డ్ సంఖ్యలో స్క్రీన్లు, షోలు ఇచ్చేలా కర్ణాటకలో రూల్స్ తేవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇబ్బని తబ్బిత ఇల్లెయాలి విషయంలో ఏం జరిగిందో పక్కన పెడితే.. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా మూవీలు హిట్స్ అవుతున్నాయని అంటున్నారు.