Begin typing your search above and press return to search.

GOAT బాక్సాఫీస్.. ఎక్కడో తేడా కొడుతోంది?

కచ్చితంగా అతని సినిమాలలో డిఫరెంట్ ఎటెంప్ట్ ఏదో ఒకటి ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 2:45 AM GMT
GOAT బాక్సాఫీస్.. ఎక్కడో తేడా కొడుతోంది?
X

ఇళయదళపతి విజయ్ కి గత కొంతకాలంలో మార్కెట్ గణనీయంగా పెరిగింది. వరుస సక్సెస్ లు అందుకోవడంతో కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా తనకంటూ సాలిడ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో విజయ్ నుంచి సినిమా వస్తుందంటే పబ్లిక్ లో ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది. కచ్చితంగా అతని సినిమాలలో డిఫరెంట్ ఎటెంప్ట్ ఏదో ఒకటి ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు.

కమర్షియల్ జోనర్ లో సినిమాలు చేసినా కూడా బలమైన కథ, కథనాలు ఉండేలా విజయ్ చూసుకుంటాడు. గత ఏడాది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో మూవీతో విజయ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. కోలీవడ్ లో థర్డ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 620 కోట్ల వరకు ఈ మూవీ లాంగ్ రన్ లో కలెక్ట్ చేసింది. అయితే లోకేష్ కనగరాజ్ చిత్రాలలో కంటెంట్ పరంగా నెగిటివ్ రిమార్క్స్ అందుకున్న మూవీ లియోనే.

లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఇమేజ్, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కారణంగా లియో సినిమా కోలీవుడ్ లో హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని అందుకుంది. మొదటి రోజు లియో సినిమాకి 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ రికార్డ్ ని GOAT బ్రేక్ చేసే బజ్ అయితే కనిపించడం లేదు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ సెప్టెంబర్ 7న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది.

ట్రైలర్ పరంగా ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో పెద్దగా మెప్పించలేదు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. అయితే అనిరుద్ ని క్రేజ్ ని అందుకునే రేంజ్ లో ఈ మ్యూజిక్ లేదనే మాట విజయ్ ఫ్యాన్స్ నుంచి కూడా వినిపిస్తోంది. దళపతి విజయ్ తమిళనాడులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రకటించి జెండా కూడా ఆవిష్కరించారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకి వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో విజయ్ సినిమాలు వదిలేస్తానని ఇప్పటికే ప్రకటించారు. GOAT మూవీ తర్వాత మరొక్క సినిమా మాత్రమే చేస్తానని చెప్పారు. హెచ్ వినోత్ దర్శకత్వంలో విజయ్ చివరి సినిమా కన్ఫర్మ్ అయిపొయింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ GOAT సినిమాకి భారీ హైప్ ఉండాలి. కానీ వాతావరణం అలా కనిపించడం లేదు. సినిమా ఫస్ట్ డే అసలు లియో రేంజ్ లో కలెక్షన్లు అందుకునే అవకాశం లేదని అనిపిస్తోంది. టాక్ బాహుంటే ఆ తరువాత రెండవ రోజు నుంచి నెంబర్లు పెరగవచ్చు. కానీ ఇప్పుడైతే అంత సీన్ లేనట్లే కనిపిస్తోంది.

ఇక టికెట్ రేట్లు కూడా భారీగా పెంచుకునే ఛాన్స్ కోలీవుడ్ లో లేదు. తెలుగు రాష్ట్రాలలో అయితే GOAT సినిమాకి టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. హైయెస్ట్ కలెక్షన్స్ రావాలంటే కోలీవుడ్ మార్కెట్ లోనే GOAT ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంది. లియోకి ఉన్నంత బజ్ ఇతర భాషలలో GOAT సినిమాకి లేకపోవడం కూడా కలెక్షన్స్ పై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.