తెలుగులో చప్పబడిపోతున్న దళపతి క్రేజ్.. కారణం అదేనా?
విజయ్ సినిమా విడుదల కావడానికి వారం రోజుల సమయం ఉంది అంటే హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు.
By: Tupaki Desk | 28 Aug 2024 10:30 PM GMTతమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు టాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న విజయ్ చేసే లాస్ట్ రెండు ప్రాజెక్ట్స్ లో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) మూవీ మొదటిదిగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. సెప్టెంబరు 5వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. విజయ్ సినిమా విడుదల కావడానికి వారం రోజుల సమయం ఉంది అంటే హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు.
అయితే రొటీన్ కి భిన్నంగా ఈసారి సోషల్ మీడియాలో ఎక్కడ ఫ్యాన్స్ హంగామా కనిపించడం లేదు. గత ఎడాది బాలకృష్ణ, రవితేజ పోటీ తట్టుకొని తెలుగులో లియో చిత్రం నిలబడి కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. దీన్ని బట్టి తెలుగులో విజయ్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. అందుకే అతని కొత్త మూవీ వస్తుంది అంటే తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఎంతో కొంత హడావిడి కనిపిస్తుంది.
తెలుగు స్టార్ హీరోల సినిమాల లాగే విజయ్ సినిమాకి కూడా ఇక్కడ థియేటర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులకు భారీ డిమాండ్ ఉంది.గోట్ మూవీపై మంచి టాక్ ఉంది.. అని ఎక్కడ కనిపించాల్సిన రేంజ్ లో బజ్ మాత్రం కనిపించడం లేదు. ఇక ఈ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు కావడం చిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గతంలోవెంకట్ ప్రభు నాగచైతన్యతో కస్టర్డ్ ఇలాంటి భారీ డిజాస్టర్ ను తీశాడు. దీంతో అతను తీసే సినిమాలపై బ్రాండ్ ఇమేజ్ పనిచేయడం లేదు.
విజయ్ సినిమాలలో మ్యూజిక్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా గత కొద్ది కాలంగా విజయ్ సినిమాలు అంటే అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ చేస్తాడు అన్న బ్రాండ్ ఉంది. అయితే దీన్ని మారుస్తూ అతని స్థానంలో యువన్ శంకర్ రాజా రావడం.. సినిమాపై ఉన్న బజ్ ని బాగా తగ్గించింది. ఇక ఈ మూవీలో విజయ్ చిన్నప్పటి పాత్ర చూపించడానికి ఉపయోగించిన ఏఐ డీ ఏజింగ్ టెక్నాలజీ చిత్రంపై కాస్త నెగెటివిటీని పెంచినట్లు కనిపిస్తోంది.
మరోపక్క తమిళ్ లో విజయ్ ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు.. కానీ ఆ రెంజ్ ప్రమోషన్స్ తెలుగులో మాత్రం చేయడం లేదు. విజయ్ ఈ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ కి వచ్చే ఛాన్స్ అయితే లేదు.. ఇక సినిమాలో మిగిలిన ముఖ్యపాత్రలతో ప్రమోషన్ ఈవెంట్ కానివ్వాలి. వీటన్నిటి వల్ల తెలుగులో విజయ్ సినిమాకి ఆశించిన స్పందన కనిపించడం లేదు అని టాక్.