Begin typing your search above and press return to search.

'ది గోట్‌' రొమాంటిక్ సెల్ఫీ అదుర్స్‌

ఇటీవలే ఆయన తన పార్టీ జెండాను కూడా ఆవిష్కరించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నట్లు అభిమానులతో చెప్పకనే చెప్పాడు.

By:  Tupaki Desk   |   2 Sep 2024 10:30 PM GMT
ది గోట్‌ రొమాంటిక్ సెల్ఫీ అదుర్స్‌
X

తమిళ్ సూపర్‌ స్టార్‌ విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం కన్ఫర్మ్‌ అయింది. ఇటీవలే ఆయన తన పార్టీ జెండాను కూడా ఆవిష్కరించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నట్లు అభిమానులతో చెప్పకనే చెప్పాడు. విజయ్ రాజకీయం పై తమిళనాడు తో పాటు మొత్తం దేశం మొత్తం ఆసక్తి నెలకొంది. త్వరలో పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారబోతున్న విజయ్‌ నటించిన తాజా చిత్రం ది గోట్‌. సాధారణంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించినప్పుడు పొలిటికల్‌ డ్రామా సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ది గోట్‌ లో పొలిటికల్‌ యాంగిల్‌ ఉన్నట్లుగా అనిపించడం లేదు.

విజయ్ చివరి సినిమాగా ది గోట్‌ ను కొందరు ఫ్యాన్స్ తో పాటు తమిళ్‌ మీడియా వర్గాల వారు ప్రచారం చేస్తున్నారు. దాంతో ది గోట్‌ పై తమిళ్‌ ఆడియన్స్ లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సాధారణంగానే విజయ్ సినిమా అంటే తమిళనాట ఓ రేంజ్ వసూళ్లు నమోదు అవుతాయి. విజయ్ చివరి సినిమా అనే ప్రచారం జరిగిన నేపథ్యంలో అంతకు మించి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది గోట్ సినిమా కు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా బజ్‌ క్రియేట్‌ అవ్వలేదు. అసలు ప్రచారం లేకుండానే రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయ్యింది. తమిళ్‌ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ది గోట్‌ కి రెస్పాన్స్ బాగానే ఉందని మేకర్స్‌ అంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విజయ్‌ ఇంకా హీరోయిన్‌ మీనాక్షి చౌదరి ఫోటోను షేర్‌ చేశారు. విజయ్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో, తండ్రి కొడుకులుగా చూడబోతున్నాం. కొడుకు పాత్రను మరీ వయసు తక్కువగా చూపించారు. అందుకోసం ఉపయోగించిన టెక్నాలజీ బాగుందంటూ నెటిజన్లు ఈ ఫోటోను చూసి కామెంట్స్ చేస్తున్నారు. విజయ్‌ హెయిర్‌ స్టైల్‌ తో పాటు, ఔట్‌ ఫిట్‌ భలే ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

గుంటూరు కారం సినిమా తర్వాత మీనాక్షి చౌదరి కి దక్కిన మరో భారీ చిత్రం ది గోట్‌, అది కాకుండా తమిళ్‌ సూపర్‌ స్టార్‌ తో నటించిన సినిమా అవ్వడంతో అందరి దృష్టి ఈ అమ్మడి కెరీర్‌ పై పడింది. చిన్న సినిమాల హీరోయిన్‌ గా కెరీర్‌ ఆరంభంలో సినిమాలు చేసిన ఈ అమ్మడు గుంటూరు కారం సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటించి, ది గోట్‌ లో మెయిన్‌ హీరోయిన్ గా నటించింది. ది గోట్‌ లో మీనాక్షి తో పాటు మాళవిక శర్మ కూడా నటించింది. కానీ అందరి దృష్టి కూడా మీనాక్షి చౌదరి పై నే ఉంది. విజయ్‌ తో రొమాంటిక్ సెల్ఫీ తీసుకుంటూ కనిపిస్తున్న మీనాక్షి చౌదరి అప్‌కమింగ్‌ స్టార్‌ హీరోయిన్‌ అంటూ అందరితో అనిపించుకుంటోంది. తమిళ్‌ లో ఈ సినిమా తర్వాత మీనాక్షి ఫుల్‌ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.