Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ Vs నాని ...ఒక్క వరం గ్యాప్ లో!

అయితే ఈ ఇద్దరి సినిమాల మధ్య ఉన్న ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఏమిటంటే.. వీటి మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరికీ ఒకరే, అనిరుధ్ రవిచందర్.

By:  Tupaki Desk   |   12 Feb 2025 9:51 AM GMT
విజయ్ దేవరకొండ Vs నాని ...ఒక్క వరం గ్యాప్ లో!
X

టాలీవుడ్‌లో మిడ్ రేంజ్ హీరోల్లో విజయ్ దేవరకొండ, నాని ఇద్దరూ తమ కెరీర్‌లో మరో లెవెల్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నాని ఇప్పటికే సారిపోదా శనివారం హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. మరోవైపు, విజయ్ దేవరకొండ ఖుషి తరువాత మరో మాస్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ ఇద్దరి సినిమాల మధ్య ఉన్న ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఏమిటంటే.. వీటి మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరికీ ఒకరే, అనిరుధ్ రవిచందర్.

నాని నటిస్తున్న ది ప్యారడైస్ సినిమా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నాని కెరీర్‌లో విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోందట. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండటంతో ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని సినిమాల్లో సంగీతం ఎప్పుడూ కీలకమైందే. అలాంటిది అనిరుధ్ వంటి సెన్సేషనల్ కంపోజర్‌తో కలిసి పనిచేయడం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చే అంశంగా మారింది.

ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. VD12 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ విడుదలకు సిద్ధమైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. పవర్ఫుల్ టైటిల్ ప్రస్తావనలోకి వస్తుండగా, ఇందులో విజయ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. నేడు మార్కెట్లో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ కానుందని. ఆయన మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా మరింత హైప్ పెరగనుంది.

ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ రెండు సినిమాల టీజర్లు కూడా ఒక్క వారం వ్యవధిలోనే విడుదల కానున్నాయి. ది ప్యారడైస్ టీజర్, VD12 టీజర్ లకు అనిరుద్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పైనే అందరి ఫోకస్ ఉంది. టీజర్స్ అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారబోతున్నాయని చెప్పవచ్చు. ఇక మ్యూజిక్ పరంగా ఫ్యాన్స్ కు ఓ ట్రీట్ అనే చెప్పాలి. అయితే రెండింటిలో ఏ సినిమా మ్యూజిక్ పరంగా ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

అనిరుధ్ ఈమధ్య కాలంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే తన సినిమాలకు మరింత బూస్ట్ ఇచ్చాడు. జవాన్, జైలర్, దేవర వంటి బిగ్ బడ్జెట్ సినిమాలకు సంగీతం అందించి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ను ఊపేశాడు. ఇక ఇప్పుడు నాని, విజయ్ సినిమాలకు సంగీతం అందించబోతున్న ఈ టాలెంటెడ్ కంపోజర్, మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో కూడా అనిరుధ్ మ్యూజిక్ కీలకంగా ఉండబోతుందనేది స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక విజయ్ దేవరకొండ, నాని కెరీర్‌లు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లేలా ఈ సినిమాలు ఉంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ తక్కువ సమయంలో స్టార్ హీరోలుగా ఎదిగిన వారు. అనిరుధ్ మ్యూజిక్‌తో వీరి సినిమాలకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉండటంతో ఈ రేసులో ఎవరు ముందంజలో ఉంటారో వేచి చూడాలి.