Begin typing your search above and press return to search.

ఫస్ట్ 'ది గోట్'.. లాస్ట్ 'దేవర'.. సెప్టెంబర్ కంప్లీట్ లిస్ట్ ఇదే!

ఆ సందర్భంతోపాటు సెప్టెంబర్ లో కొన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

By:  Tupaki Desk   |   31 Aug 2024 4:30 PM GMT
ఫస్ట్ ది గోట్.. లాస్ట్ దేవర.. సెప్టెంబర్ కంప్లీట్ లిస్ట్ ఇదే!
X

పండుగలు.. సినిమాలు.. ఈ రెండింటికీ మంచి కనెక్షన్ ఉన్న విషయం తెలిసిందే. ఫెస్టివల్స్ వస్తే చాలు.. అనేక సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంటాయి. ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంటాయి. ఒక ఫెస్టివల్ మిస్ అయినా.. మరో పండుగకు తమ సినిమాలను రిలీజ్ చేస్తారు మేకర్స్. అయితే ఇప్పుడు వినాయక చవితి (సెప్టెంబర్ 7) వచ్చేస్తోంది. ఆ సందర్భంతోపాటు సెప్టెంబర్ లో కొన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆ వివరాలు మీకోసం..

సెప్టెంబర్ స్టార్టింగ్ లో డబ్బింగ్ తెలుగు మూవీ ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ టైమ్‌ (ది గోట్‌) ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, డైరెక్టర్ వెంకట్‌ ప్రభు కాంబోలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ది గోట్.. సెప్టెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. విజయ్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్న ఆ చిత్రంలో మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అయితే మేకర్స్ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు.

టాలీవుడ్ హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్న 35 చిన్న కథ కాదు మూవీ కూడా సెప్టెంబర్ 6వ తేదీనే విడుదల కానుంది. ఫ్యామిలీ డ్రామాగా నంద కిషోర్‌ ఇమానీ తెరకెక్కిస్తున్న ఆ చిత్రంలో విశ్వదేవ్, బ్యూటీ నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదే రోజు నారా రోహిత్ సుందరకాండ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేశ్‌ నిమ్మలపూడి డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

వీటితో పాటు అదే రోజు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీ విడుదల అవ్వనుంది. 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలెంటెడ్ హీరో సుహాస్ జనక అయితే గనక చిత్రం ఏడో తేదీన రిలీజ్ కానుంది. రాజ్‌ తరుణ్‌ భలే ఉన్నాడే, తేజస్‌ కంచెర్ల ఉరుకు పటేలా చిత్రాలు కూడా అదే రోజు రానున్నాయి. ఇక సెప్టెంబర్ రెండో వారంలో మత్తు వదలరా 2, ధూం ధాం, ఉత్సవం మూవీలు విడుదల అవ్వనున్నాయి. 13వ తేదీన రానున్నాయి.

అయితే సెప్టెంబర్ థర్డ్ వీక్ లిస్ట్ ఇంకా బయటకు రాకపోయినా.. ఫోర్త్ వీక్ లో మాత్రం దేవర పార్ట్-1 సోలో రిలీజ్ కానుంది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న ఆ మూవీపై సినీ ప్రియులతో పాటు ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా తెలుగులోకి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తోంది. మరి సెప్టెంబర్ లో విడుదల కానున్న సినిమాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.