రెస్టారెంట్ లో విజయ్, రష్మిక.. 'ఇంకెప్పుడు చెబుతారు!?'
కొద్ది రోజుల క్రితం దీపావళిని విజయ్ ఇంట్లోనే రష్మిక జరుపుకున్నారని కూడా వార్తలు వచ్చాయి.
By: Tupaki Desk | 24 Nov 2024 6:35 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న.. రిలేషన్ లో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ తాము ఫ్రెండ్స్ అని పలు సందర్భాల్లో చెప్పినా.. ప్రేమలో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. కొద్ది రోజుల క్రితం దీపావళిని విజయ్ ఇంట్లోనే రష్మిక జరుపుకున్నారని కూడా వార్తలు వచ్చాయి.
అందుకు కారణం రష్మిక కామెంట్. తన పోస్ట్ లో థ్యాంక్యూ ఆనందా అంటూ విజయ్ దేవరకొండ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండకు ఫోటో క్రెడిట్ ఇచ్చారు. దీంతో విజయ్ ఇంట్లోనే రష్మిక ఫెస్టివల్ ను సెలబ్రేట్ చేసుకున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత రీసెంట్ గా మ్యూజిక్ ఆల్బమ్ సాహిబా ప్రమోషన్స్ లో విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మాట్లాడారు. తాను సింగిల్ కాదని తెలిపారు. రిలేషన్ లో ఉన్నానని చెప్పారు. కోస్టార్ తో డేటింగ్ చేశానని ఇన్ డైరెక్ట్ గా తెలిపారు. దీంతో విజయ్, రష్మిక పెళ్లి అనౌన్స్మెంట్ త్వరలో రానుందని అంతా మాట్లాడుకున్నారు. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ జోడీకి సంబంధించిన పిక్ వైరల్ అవుతోంది.
ఓ రెస్టారెంట్ లో విజయ్, రష్మిక కలిసి తింటున్న పిక్.. నెట్టింట దర్శనమిచ్చింది. ఎవరో సీక్రెట్ గా ఆ ఫోటో తీసినట్లు అర్థమవుతుంది. అయితే ఆ పిక్ ఎప్పుడు, ఎక్కడ తీశారన్నది క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారన్న అంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. వెయిటింగ్ అని అంటున్నారు.
మొత్తానికి రిలేషన్ షిప్ స్టేటస్ గురించి విజయ్ కామెంట్స్ చేసిన కొద్ది రోజులకే.. రెస్టారెంట్ లో ఇద్దరూ ఉన్న పిక్ బయటకు రావడంతో ఓ రేంజ్ లో అట్రాక్ట్ చేస్తోంది. అదే సమయంలో విజయ్, రష్మిక ప్రేమ కహానీ హాట్ టాపిక్ గా మారింది. అందరూ దాని కోసం తెగ మాట్లాడుకుంటున్నారు. క్యూట్ అండ్ లవ్లీ కపుల్ అంటూ నెటిజన్లు సందడి చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మరోవైపు, రష్మిక..పుష్ప సీక్వెల్ తో బిజీగా ఉన్నారు. త్వరలో శ్రీవల్లి 2.0గా సందడి చేయనున్నారు. మరి వారిద్దరూ తమ కొత్త చిత్రాలతో ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.