విజయ్ - రష్మిక.. మళ్లీ ఇలా..
టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా మారిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.
By: Tupaki Desk | 5 Feb 2025 12:56 PM GMTటాలీవుడ్‌లో ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా మారిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి పుకార్లు ఎన్నో వచ్చినా, ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, వీరి మధ్య ప్రత్యేకమైన బాండ్ ఉందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇద్దరూ తరచూ కలిసి హాలిడే ట్రిప్స్‌కు వెళ్తుండటం, ముంబైలో ఒకే అపార్ట్మెంట్‌లో ఉండటం వంటి రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి.
ఇక బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో రష్మిక పెళ్లి గురించి మాట్లాడటం కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే ఈ ఏడాదిలో విజయ్ - రష్మిక పెళ్లి జరిగిపోతుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది నిజమేనా..? లేక మరోసారి వీరి మధ్య ఉన్న స్నేహం గురించి ఫ్యాన్స్ తప్పుడు అర్థం చేసుకుంటున్నారా అనేది తెలియాలంటే కొంత సమయం పడుతుంది.
రష్మిక కూడా తాను పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని చెబుతున్నప్పటికీ, ఆమె రీసెంట్ కామెంట్స్ చూస్తుంటే మాత్రం త్వరలో పెళ్లి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేలా కనిపిస్తోంది. తాజాగా ఈ క్యూట్ జంట మరోసారి వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం రష్మిక కాలి గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటోందని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమీ లేదు. రీసెంట్‌గా ఆమె విజయ్‌తో కలిసి జిమ్‌కి వెళ్లిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో వీల్‌చైర్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు మరోసారి షాక్ అయ్యారు. డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్పినా కూడా జిమ్‌కు వెళ్లడం ఏంటని నెట్టింట్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఛావా మూవీ ప్రమోషన్స్‌కి కూడా రష్మిక వీల్‌చైర్‌తోనే హాజరవుతోంది. విజయ్ - రష్మిక జంట మరోసారి జిమ్ వెలుపల కలిసి కనిపించడం, ఫ్యాన్స్‌కు ఇది పెద్ద టాపిక్ అయ్యింది. అధికారికంగా వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను ప్రకటించకపోయినా, ఇలాంటి వీడియోలు చూస్తుంటే త్వరలో పెళ్లి జరగబోతుందన్న అభిప్రాయం బలపడుతోంది.
రష్మిక ఇప్పుడే పెళ్లిపై క్లారిటీ ఇవ్వకపోయినా, ఫ్యాన్స్ మాత్రం ఈ ఏడాదిలో పెళ్లి ఖచ్చితమని నమ్మకంగా ఉన్నారు. మరి రౌడీ హీరో విజయ్ ఫైనల్‌గా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతాడా అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉండగా, విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్ ఇప్పటికే రెడీగా ఉన్నట్లు సమాచారం. అనిరుధ్ మ్యూజిక్ వర్క్ పూర్తికాగానే, మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ వస్తుందని అంటున్నారు. మరోవైపు రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో కూడా విజయ్ - రష్మిక మరోసారి జతకట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.