Begin typing your search above and press return to search.

'ఏస్' గ్లింప్స్.. సేతుపతి మాస్ కిక్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరోసారి తన అభిమానులను అలరించడానికి డిఫరెంట్ గా సిద్ధమవుతున్నాడు.

By:  Tupaki Desk   |   16 Jan 2025 1:40 PM GMT
ఏస్ గ్లింప్స్.. సేతుపతి మాస్ కిక్
X

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరోసారి తన అభిమానులను అలరించడానికి డిఫరెంట్ గా సిద్ధమవుతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఏస్' నుంచి ప్రత్యేక గ్లింప్స్ విడుదలైంది. అరుముగకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన రుక్మిణి వసంత్, యోగిబాబు, బి.ఎస్. అవినాష్, దివ్యా పిళ్లై, బబ్లూ, రాజ్‌కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమాటోగ్రాఫర్ కరణ్ భగత్ రావత్ అందించిన విజువల్స్, జస్టిన్ ప్రభాకరన్ అందించిన మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. 'ఏస్' చిత్రం వినోదంతో పాటు భారీ మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫెన్నీ ఒలివర్ ఎడిటింగ్ అందించగా, ఏకే ముత్తు ఆర్ట్ డైరెక్షన్ చేపట్టారు. 7సీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అరుముగకుమార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

విజయ్ సేతుపతి పాత్ర పేరును 'బోల్డ్ కన్నన్' అని పెట్టడం ఈ చిత్రంపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్, మిలియన్ల వ్యూస్ సాధించడంతో పాటు రికార్డులు సృష్టించింది. తాజాగా విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ విడుదల చేయడం ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచింది.

గ్లింప్స్‌లో విజయ్ సేతుపతి తమిళ స్టైల్ కు తగ్గట్టుగా లుంగిలో, మలేసియాలోని ఎయిర్‌పోర్ట్‌లో దర్జాగా నడుస్తున్న సన్నివేశాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే హై-ఓక్టేన్ యాక్షన్ సీన్స్, వేడుకల్లో ఆనందంగా డాన్స్ చేయడం, స్ట్రీట్ లో స్టైలిష్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సన్నివేశాలు చూస్తుంటే సినిమా పూర్తి వినోదంతో కూడుకున్న మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్నదని అర్ధమవుతుంది.

విజయ్ సేతుపతి నటన, ఆయన పాత్రకు ఉన్న డెప్త్, డైనమిక్ లుక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తమిళనాట మాత్రమే కాకుండా, చైనా వంటి అంతర్జాతీయ మార్కెట్లో కూడా విజయ్ సేతుపతి తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవల మహారాజా సినిమా అక్కడ 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ఇక ఈ చిత్రం విజయ్ సేతుపతికి మరొక గుర్తుండిపోయే విజయాన్ని అందించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక 'ఏస్' చిత్రం థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.