Begin typing your search above and press return to search.

కింగ్ తో న‌టించ‌డానికి మ‌క్క‌ల్ సెల్వ‌న్ సిద్దం!

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియాలో అత‌డి కంటూ ప్ర‌త్యేక మైన ఇమేజ్ ఉంది.

By:  Tupaki Desk   |   21 Dec 2024 4:30 PM GMT
కింగ్ తో న‌టించ‌డానికి మ‌క్క‌ల్ సెల్వ‌న్ సిద్దం!
X

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియాలో అత‌డి కంటూ ప్ర‌త్యేక మైన ఇమేజ్ ఉంది. హీరో అయినా విల‌న్ అయినా పాత్ర‌లోకి దూర‌నంత వ‌ర‌కే. అత‌డు ఎంట‌ర్ అయితే ఆ సినిమా రూపు రేఖ‌లే మారిపోతాయి. డిమాండింగ్ యాక్ట‌ర్ గా సేతుప‌తికి ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఇండ‌స్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి సక్సెస్ అయిన న‌టుడు. ఇండియాలో ఉన్న డైరెక్ట‌ర్లు అంతా అత‌డితో ప‌నిచేయాల‌ని ఆస‌క్తి చూపిస్తున్నారు.

స్టార్ హీరోలంతా త‌మ సినిమాల్లో సేతుప‌తి విల‌న్ గా న‌టిస్తే బాగుండ‌ని కోరుకుంటున్నారు. అలా ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ న‌డుగా మ‌క్క‌ల్ సెల్వ‌న్ కి గుర్తింపు ఉంది. అంత‌టి క్రేజీ స్టార్ కింగ్ నాగార్జున సినిమాలో న‌టించ‌డానికి ఆస‌క్తిని వ్య‌క్తం చేయ‌డం విశేషం. అవును బిగ్ బాస్ షో వేదిక‌గా విజ‌య్ సేతుప‌తి ఆ విధంగా ఓపెన్ అయ్యాడు. మంజువారియ‌ర్ తో క‌లిసి సేతుప‌తి నాగార్జున హోస్ట్ గా చేస్తోన్న బిగ్ బాస్ కి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ముందుగా మంజువారియ‌ర్ నాగ్ స‌ర్ తో పని చేయాల‌ని ఉంద‌ని అన్నారు. దీంతో విజ‌య్ సేతుప‌తి నేను కూడా ఆయ‌న‌తో న‌టించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. వీలు ప‌డ‌లేదు. ఈ సారి ఛాన్స్ వ‌స్తే మిస్ చేసుకోను అన్న రేంజ్ లో చెప్పుకొచ్చాడు. ఇంత వ‌ర‌కూ విజయ్ సేతుప‌తి ఫలానా న‌టుడి సినిమాలో చేయాల‌ని ఉంద‌ని అని ఎక్క‌డా చెప్పింది లేదు. త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు.

ఈ మ‌ధ్య కాలంలో కొత్త సినిమాలు వేటికి సైన్ చేయ‌లేదు. స‌రైన క‌థ‌లు రావ‌డం లేద‌ని, పాత్ర‌లు రావ‌డం లేద‌ని అందుకే క‌మిట్ అవ్వ‌డం లేద‌న్నారు దీంతో సేతుప‌తిపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కావాల‌నే సినిమాలు చేయ‌లేద‌ని విమ‌ర్శలు ఎదుర్కంటున్నాడు. అయితే విల‌న్ పాత్ర‌లు మాత్రం చేయ‌న‌ని ఓ సంద‌ర్భంలో అన్నారు. మ‌రి ఆ మాట‌కు క‌ట్టుబ‌డి విల‌న్ ఆఫ‌ర్లు వ‌చ్చినా? వ‌ద్ద‌నుకుంటున్నారేమో.