అందరూ నా పనైపోయిందనుకున్నారు: సేతుపతి
విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమాలు మాత్రం ఫ్లాపులుగా నిలవడంతో అందరూ హీరోగా ఇక సేతుపతి పనైపోయిందనుకున్నారు.
By: Tupaki Desk | 14 March 2025 12:51 PM ISTప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి మహారాజా సినిమాకు ముందు హీరోగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే వచ్చాయి. విడుదల1, విడుదల2కు పేరైతే వచ్చింది కానీ కమర్షియల్ గా మాత్రం ఆ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ అవలేదు. కానీ సేతుపతి విలన్ గా చేసిన సినిమాలు మాత్రం మంచి ఆదరణ పొందాయి.
విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమాలు మాత్రం ఫ్లాపులుగా నిలవడంతో అందరూ హీరోగా ఇక సేతుపతి పనైపోయిందనుకున్నారు. అలాంటి టైమ్ లో సేతుపతి కెరీర్ లో 50వ సినిమాగా వచ్చిన మహారాజా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సేతుపతి కెరీర్ లోనే మహారాజా మైల్ స్టోన్ మూవీ అయిపోయింది. కెరీర్ ముగిసిందనే టైమ్ కు మహారాజా సినిమా తనను మళ్లీ నిలబెట్టిందని రీసెంట్ గా సేతుపతి ఓ వేడుకలో తెలిపారు.
ఓ అవార్డు ఫంక్షన్ లో మహారాజా మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డు రాగా, అవార్డు తీసుకున్న తర్వాత సేతుపతి ఈ మూవీ గురించి మాట్లాడి తన సంతోషాన్ని పంచుకున్నారు. 2-3 ఏళ్లుగా తన నుంచి వచ్చిన సినిమాలేవీ బాగా ఆడలేదని, సరైన టైమ్ లో వచ్చిన మహారాజా తనను నిజంగానే మహారాజాను చేసిందని, ఈ మూవీకి ఇన్ని ప్రశంసలొస్తాయని ఊహించలేదని, చైనాలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా మహారాజా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాలో ఎలాంటి సాంగ్స్, అనవసరమైన ఫైట్స్ లేకుండా కేవలం కథతోనే మహారాజా సినిమాను నడిపించాడు డైరెక్టర్ నిథిలన్. కథతో పాటూ సేతుపతి తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మహారాజా సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి.
ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి మహారాజా తర్వాత కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వచ్చిన కథలన్నీ ఒప్పుకోకుండా, బాగా నచ్చిన కథల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. కథ బాగుండి తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్నే ఎంచుకుని వాటిని మాత్రమే చేయాలని సేతుపతి నిర్ణయించుకున్నారట. ఇక మీదట రెగ్యులర్ గా ఉండే విలన్ పాత్రలకు కూడా సేతుపతి నో చెప్తాడని అంటున్నారు.