మక్కల్ సెల్వన్ తో మున్నా భాయ్..?
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ రాజ్ కుమార్ హిరాణి చేసిన సినిమాల్లో మున్నా భాయ్ సీరీస్ లకు సూపర్ క్రేజ్ ఉంది.
By: Tupaki Desk | 20 Jan 2025 10:30 AM GMTబాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ రాజ్ కుమార్ హిరాణి చేసిన సినిమాల్లో మున్నా భాయ్ సీరీస్ లకు సూపర్ క్రేజ్ ఉంది. సంజయ్ దత్ లీడ్ రోల్ లో వచ్చిన మున్నాభాయ్ MBBS, లగే రహో మున్నాభాయ్ సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఐతే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్లీ మున్నా భాయ్ హంగామాని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. రాజ్ కుమార్ హిరాణి మున్నా భాయ్ 3 సినిమా కథా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది. సంజయ్ దత్ తోనే 3వ భాగం కూడా తీసేలా ప్లాన్ చేస్తున్నట్టు బీ టౌన్ టాక్.
ఐతే ఈ సినిమాలో సౌత్ స్టార్ కూడా కీలక పాత్రలో నటిస్తాడని తెలుస్తుంది. మున్నా భాయ్ సీరీస్ లో మన సౌత్ ఇండియా స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయట. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి 100 పర్సెంట్ న్యాయం చేస్తాడు. మున్నా భాయ్ లాంటి సినిమాలకు అయితే ఆయన పర్ఫెక్ట్ అనిపిస్తారు. ఈమధ్య సంజయ్ దత్ సీరియస్ పాత్రలు చేస్తూ వస్తున్నారు.
సౌత్ సినిమాల్లో ఆయన విలంగ్ ఆ మెప్పిస్తున్నారు. ఐతే మున్నాభాయ్ సీరీస్ తో మరోసారి ఆయనలోని కామెడీ యాంగిల్ ని చూపించాలని ఫిక్స్ అయ్యారు. రాజ్ కుమార్ కథ సిద్ధం చేయడమే ఆలస్యం సంజయ్ దత్ రెడీ అనేస్తాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటించడం పట్ల సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. విజయ్ సేతుపతి ఉంటే మాత్రం ఈ సినిమాకు స్పెషల్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు.
మున్నా భాయ్ సీరీస్ లను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేసి హిట్ అందుకున్నారు. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలతో చిరంజీవి మున్నాభాయ్ సీరీస్ లతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఐతే మున్నాభాయ్ 3వ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తారా లేదా బాలీవుడ్ ఆడియన్స్ కే పరిమితం చేస్తారా అన్నది చూడాలి. సంజయ్ దత్, విజయ్ సేతుపతి ఈ కాంబో అసలు ఊహించలేదు. కచ్చితంగా విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తే ఊహించని విధంగా క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది.