Begin typing your search above and press return to search.

ఏంటి ఆ స్పెష‌ల్ పూరి జీ!

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి తో ఏ డైరెక్ట‌ర్ ప‌నిచేయాలి? అన్నా? ఆ సినిమాలో అత‌డి పాత్ర ఎంతో బ‌లంగా ఉండాలి.

By:  Tupaki Desk   |   22 March 2025 4:15 AM IST
ఏంటి ఆ స్పెష‌ల్ పూరి జీ!
X

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి తో ఏ డైరెక్ట‌ర్ ప‌నిచేయాలి? అన్నా? ఆ సినిమాలో అత‌డి పాత్ర ఎంతో బ‌లంగా ఉండాలి. అది హీరో పాత్ర అయినా రెగ్యుల‌ర్ గా ఉంటే చేయ‌డు. రొటీన్ కి భిన్నమైన పాత్రై ఉండాలి. ఒక‌ప్పుడు నెగిటివ్ రోల్ అయినా...పాజిటివ్ రోల్ అయినా అలాంటి ఎంపిక‌లు క‌నిపించేవి. అయితే విల‌న్ గా మాత్రం సినిమాలు చేయ‌న‌ని ఇటీవ‌లే ఓ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో విజ‌య్ సేతుప‌తి ఇక‌పై ఏ సినిమా చేసినా? హీరోగానే. ఆ క‌థ‌లో కొత్త‌ద‌నం ఉండాలి. పాత్ర బ‌లంగా ఉండాలి. ఓ సినిమాకి ఆయ‌న్ని ఒప్పించడం కూడా అంత సుల‌భ‌మైన ప‌ని కాదు. అత‌డి లాంగ్ కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని సెల‌క్టివ్ గా వెళ్తున్నాడు. అయితే అలాంటి న‌టుడు పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ కత్వంలో న‌టించ‌డానికి ఒప్పుకున్నాడా? అంటే అవున‌నే కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌లే సేతుప‌తికి పూరి ఓ స్టోరీ వినిపించాడుట‌. న‌చ్చడంతో మ‌రో ఆలోచ‌న లేకుండా విజ‌య్ అంగీక రించాడ‌ని స‌మాచారం. దీంతో పూరి అత‌డినికి ఎలా ఒప్పించాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. పూరి సినిమాలు ఎలా ఉంటాయి? అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పూరి మాస్ ఫార్ములా ఇప్పుడు ఔడెటెడ్ గా మారిన సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా స‌క్సెస్ లేక వెనుక‌బ‌డ్డాడు.

తీసిన సినిమాల్నే మ‌ళ్లీ అటు తిప్పి ఇటు తిప్పి తీస్తున్నాడ‌నే విమ‌ర్శ‌లు చాలా కాలంగా ఎదుర్కుంటున్నాడు. దీంతో టాలీవుడ్ హీరోలే డేట్లు ఇవ్వ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌తంలో పూరి సినిమాల‌తోనే స‌క్సెస్ లు అందుకున్న హీరోలే ఇప్పుడు అత‌న్ని దూరం పెడుతున్నారు. అలాంటి స‌మ‌యంలో పూరి సేతుప‌తిని త‌న క‌థ‌తో ఒప్పించాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి ఇందులో నిజ‌మెంతో అధికారికంగా వెల్ల‌డి కావాల్సి ఉంది.