Begin typing your search above and press return to search.

మక్కల్ సెల్వన్ 8 రోజుల షూట్.. 120 రోజుల బుక్..!

సౌత్ స్టార్స్ లో తన నటన తో భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని ఏర్పరచుకుంటున్న యాక్టర్ విజయ్ సేతుపతి.

By:  Tupaki Desk   |   20 Dec 2024 4:52 AM GMT
మక్కల్ సెల్వన్ 8 రోజుల షూట్.. 120 రోజుల బుక్..!
X

సౌత్ స్టార్స్ లో తన నటన తో భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని ఏర్పరచుకుంటున్న యాక్టర్ విజయ్ సేతుపతి. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ఆడియన్స్ అంతా కూడా అలర్ట్ అవుతుంటారు. విజయ్ సేతుపతి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉండాలని ఆడియన్స్ కాదు తను కూడా కోరుకుంటాడు. అందుకే విజయ్ సేతుపతి సినిమాలు చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి. నటుడిగా తనకు తాను ఛాలెంజ్ చేసుకునే పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నాడు విజయ్ సేతుపతి.

అందుకే ఆయన్ను అందరు ప్రేమగా మక్కల్ సెల్వన్ అని పిలుస్తారు. విజయ్ ఒక సినిమా పిక్ చేశాడు అంటే అది తప్పకుండా ప్రేక్షకాదరణ పొందేలా ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు. తన 50వ సినిమా మహారాజతో మరో సూపర్ హిట్ అందుకున్న విజయ్ సేతుపతి లేటెస్ట్ గా విడుదల 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వెట్రిమారన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తో మరోసారి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయనున్నారు.

కోలీవుడ్ లో వెట్రిమారన్ సినిమాలకు ఏ రేంజ్ డిమాండ్ ఉంటుందో తెలిసిందే. ఇక విజయ్ సేతుపతి లాంటి నటుడు దొరికితే ఇద్దరు కలిసి అద్భుతాలు చేస్తారు. విడుదల 2 సినిమాకు విజయ్ సేతుపతి దాదాపు 120 రోజుల పైగా డేట్స్ ఇచ్చారట. ఈ విషయాన్నే చాలా కామెడీగా వెల్లడించారు విజయ్ సేతుపతి. తనతో వెట్రిమారన్ కేవలం 8 రోజుల షూట్ అని చెప్పి ఒప్పించాడట. ఆ 8 రోజులు కాస్త 128 రోజులు అయిందని చెప్పాడు విజయ్ సేతుపతి.

మన స్టార్స్ అయితే ఈ విషయంపై ఎంత పెద్ద సీన్ చేసే వారో కానీ విజయ్ సేతుపతి వెట్రిమారన్ మార్క్ టేకింగ్ తెలుసు కాబట్టి ఆయనతో పనిచేయడానికి ఇష్టపడి ఆయన అడిగినన్ని డేట్స్ ఇచ్చారట. ఐతే విజయ్ సేతుపతి పడిన కష్టానికి విడుదల 2 మంచి ఫలితాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. విడుదల 2 పీరియాడికల్ స్టోరీ అది కూడా ఒక రివల్యూషన్ పాయింట్ తో వస్తుంది.

ఇలాంటి కథలు అంత రెగ్యులర్ గా దొరకవు అందుకే. వచ్చిన ఛాన్స్ ని వాడేసుకున్నాడు విజయ్ సేతుపతి. పతిభ గల దర్శకుడు.. టాలెంటెడ్ యాక్టర్ కలిసి చేస్తే సినిమా ఎలా ఉంటుందో చెప్పేలా విడుదల 2 వస్తుంది. ఈ సినిమాలో మంజు వారియర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.