Begin typing your search above and press return to search.

విజయ్‌కి తెలుగులో అంత క్రేజా?

ఒకప్పుడు తెలుగు ఆధిపత్యం చలాయించిన తమిళ స్టార్లలో చాలామంది మార్కెట్ దెబ్బ తింది.

By:  Tupaki Desk   |   3 Sep 2024 12:33 PM GMT
విజయ్‌కి తెలుగులో అంత క్రేజా?
X

ఒకప్పుడు తెలుగు ఆధిపత్యం చలాయించిన తమిళ స్టార్లలో చాలామంది మార్కెట్ దెబ్బ తింది. ఆ జాబితాలో రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య లాంటి హీరోలున్నారు. ఐతే వీరి సినిమాలు తెలుగులో ఇరగాడుతున్న టైంలో విజయ్‌కి ఇక్కడ అస్సలు మార్కెట్టే ఉండేది కాదు. తన సినిమాలు తెలుగులో రిలీజవడమే గగనం అన్నట్లుండేది. కానీ గత దశాబ్ద కాలంలో విజయ్‌కి తెలుగులో బాగా మార్కెట్ పెరిగింది. తుపాకి, జిల్లా, అదిరింది, విజిల్, మాస్టర్, వారసుడు, లియో చిత్రాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా లియో సినిమాకు తెలుగులో బంపర్ క్రేజ్ వచ్చింది. ఉదయం 6-7 గంటలకు షోలు వేస్తే ఫుల్స్ పడ్డాయి. డివైడ్ టాక్ వచ్చినా సరే.. ఆ సినిమా కమర్షియల్‌గా మంచి ఫలితాన్నందుకుంది. దీంతో విజయ్ కొత్త చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (గోట్)కు బాగా ప్లస్ అయింది.

‘లియో’ హక్కులు తెలుగులో రూ.15 కోట్లు పలికితే.. ‘గోట్’ సినిమాకు తెలుగులో ఏకంగా రూ.22 కోట్ల బిజినెస్ జరగడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏకంగా అంత రేటు పెట్టి సినిమాను కొని రిలీజ్ చేస్తోంది. నిజానికి ‘లియో’కు ఉన్నంత బజ్ ‘గోట్’కు లేదు. తమిళంలోనే కాక తెలుగులోనూ ఈ చిత్రానికి సరిగా ప్రమోషన్లు చేయలేదు. ట్రైలర్ చూస్తే బాగానే అనిపించినా.. కొంచెం లో బజ్‌తోనే రిలీజవుతోందీ చిత్రం. అయినా ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ఆశ్చర్యం కలిగించే విషయమే. విశేషం ఏంటంటే.. ‘గోట్’ మూవీకి తెలుగులో తెల్లవారుజామున 4 గంటలక షోలు పడబోతున్నాయి. ఈ విషయాన్ని ప్రి రిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించారు. అనుమతుల కోసం దరఖాస్తు చేశామని.. షోలు ఆ సమయానికే పడతాయని వెల్లడించారు. తమిళనాట తెల్లవారుజామున షోలకు అనుమతులు లేవు. అంటే అక్కడ కంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో షోలు పడబోతున్నాయన్నమాట.