Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి కెరీర్ గ్రేటెస్ట్ డిజాస్ట‌ర్?

కానీ GOAT చెత్తగా ఉందని ట్రేడ్ చెబుతోంది. విజ‌య్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గోట్.

By:  Tupaki Desk   |   8 Sep 2024 5:53 AM GMT
ద‌ళ‌ప‌తి కెరీర్ గ్రేటెస్ట్ డిజాస్ట‌ర్?
X

విజ‌య్ న‌టించిన యావ‌రేజ్ సినిమాని కూడా త‌మిళ తంబీలు పెద్ద హిట్టు చేస్తారు. అయితే అత‌డి ప‌ప్పులు త‌మిళ‌నాడులో ఉడుకుతాయి. కానీ తెలుగులో కాదు. ఇక్క‌డ య‌థావిధిగా ద‌ళ‌ప‌తి న‌టించిన GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) బిగ్ ఫ్లాప్ గా నిలిచింద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

ప్రీబిజినెస్ ప్ర‌కారం.. తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు అంత‌కుమించి వ‌సూలు చేయాల్సి ఉండ‌గా, క‌నీసం కోటి లోపు షేర్ తెస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ఫ‌లితం ఊహించ‌నిది. అస‌లు థియేట‌ర్ల‌లో హుషారు అన్న‌దే లేదు. విజ‌య్ గ‌త‌ చిత్రాలు మాస్టర్, అదిరింది, వారసుడు, లియో తెలుగు పంపిణీదారులకు ఓ మోస్త‌రు లాభాల్ని అందించాయి. బీస్ట్ యావ‌రేజ్ గా ఆడింది. కానీ GOAT చెత్తగా ఉందని ట్రేడ్ చెబుతోంది. విజ‌య్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గోట్. అయితే తెలుగులో ఫ‌లితం ఇలా ఉంటే, అటు త‌మిళంలో బాగానే ఆడుతోందని స‌మాచారం. ఓవ‌ర్సీస్ లోను ఫ‌ర్వాలేద‌నే టాక్ వినిపిస్తోంది.

అయితే తెలుగులో ఇంత పెద్ద ఫ్లాప‌వ్వ‌డానికి కార‌ణం.. ఈ సినిమాకి స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డం, కంటెంట్ ప‌రంగా రొటీనిటీ అన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ్యూజిక్ కూడా ప్ర‌భావం చూప‌లేదు. ఈ సినిమా ట్రైల‌ర్ కానీ, పాట‌లు కానీ ఇక్క‌డ ఎవ‌రికీ న‌చ్చ‌లేదు. దాంతో అంత‌గా బ‌జ్ క్రియేట్ కాలేదు. స‌రైన ప్ర‌చారం లేని సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ద‌క్క‌డం అంత సులువు కాద‌ని చాలాసార్లు ప్రూవ్ అయింది. మ‌రోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాల కార‌ణంగా కూడా జ‌నం థియేట‌ర్ల వైపు వెళ్ల‌డం లేద‌ని అంచ‌నా వేస్తున్నారు.