Begin typing your search above and press return to search.

కిల్ డైరెక్ట‌ర్‌తో విజ‌య్ సినిమా?

ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా ఏకంగా స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయి బాలీవుడ్ లో కూడా స‌త్తా చాటాడు.

By:  Tupaki Desk   |   18 Feb 2025 1:02 PM GMT
కిల్ డైరెక్ట‌ర్‌తో విజ‌య్ సినిమా?
X

స‌పోర్టింగ్ రోల్ లో న‌టించి త‌ర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మంచి స‌క్సెస్ అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఆ త‌ర్వాత చేసిన అర్జున్ రెడ్డి మూవీతో ఇండ‌స్ట్రీని షేక్ చేశాడు. టాలీవుడ్ పై అర్జున్ రెడ్డి మూవీ చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా ఏకంగా స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయి బాలీవుడ్ లో కూడా స‌త్తా చాటాడు.

ఇక విజ‌య్ సంగ‌తికి వ‌స్తే గ‌త కొన్ని సినిమాలుగా విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం విజ‌య్, గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో కింగ్‌డ‌మ్ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. రీసెంట్ గానే దానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవాల‌ని చూస్తున్నాడు విజ‌య్.

విజ‌య్ తో లైగ‌ర్ సినిమా చేసిన‌ప్ప‌టి నుంచి క‌ర‌ణ్ జోహార్ త‌న‌తో ఓ సినిమా చేయాల‌ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిస్క‌ష‌న్స్ కూడా జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే కిల్ ఫేమ్ నిఖిల్ న‌గేష్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్న‌ట్టు ఇప్పుడు వార్త‌లొస్తున్నాయి.

రెండు వారాల కింద‌టే డైరెక్ట‌ర్ నిఖిల్ హైద‌రాబాద్ లో విజ‌య్ ను క‌లిశార‌ని, అన్నీ కుదిరితే ప్ర‌స్తుతం విజయ్ కు ఉన్న క‌మిట్‌మెంట్స్ అన్నీ పూర్త‌య్యాక నిఖిల్- విజ‌య్ కాంబోలో సినిమా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ సినిమాకు క‌ర‌ణ్ జోహార్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించ‌నున్నట్టు తెలుస్తోంది. అయితే నాలుగు రోజులు ముందు నిఖిల్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఓ మైథలాజిక‌ల్ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌ర‌గ్గా, ఆ వార్త‌ల‌న్నీ రూమ‌ర్లేన‌ని డైరెక్ట‌ర్ కొట్టిపారేశాడు. అలాంటి టైమ్ లో ఇప్పుడు నిఖిల్ భ‌ట్ లైన్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇక విజ‌య్ సినిమాల విష‌యానికొస్తే ప్ర‌స్తుతం కింగ్‌డ‌మ్ చేస్తున్న రౌడీ హీరో, త‌ర్వాత ర‌వి కిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, రాహుల్ సాంకృత్స్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు హిట్ అయి విజ‌య్ స‌క్సెస్ ట్రాక్ ఎక్కితే సుకుమార్ తో సినిమా ఉండే ఛాన్సుంది. ఇవ‌న్నీ పూర్తి కావాలంటే ఎంత లేద‌న్నా 2027 వ‌స్తుంది. కాబ‌ట్టి నిఖిల్ భ‌ట్ తో విజ‌య్ సినిమా ఉన్నా అది ఇప్ప‌ట్లో అయితే ప‌ట్టాలెక్క‌దు.