తమన్నా-విజయ్ ఆ ఫోటోల గుట్టు ఎందుకు విప్పనట్లు?
తమన్నా అంటే విజయ్ వర్మకి ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో ఓపెన్ గానే షేర్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 28 Aug 2024 2:20 PM GMTతమన్నా-విజయ్ వర్మ మధ్య రిలేషన్ షిప్ బహిర్గతమే. ప్రస్తుతం ఇద్దరు లవ్ లో పీక్స్ లో ఉన్నారు. ఏడాది కాలంగా ఇద్దరి మధ్య బంధం పెనవేసుకుంది. తమ మధ్య బాండింగ్ ని రివీల్ చేస్తూ ఎన్నో ఫోటోలు..వీడియోలు సైతం రిలీజ్ చేసారు. తమన్నా అంటే విజయ్ వర్మకి ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో ఓపెన్ గానే షేర్ చేసుకున్నాడు. అంతే ప్రేమని తమన్నా సైతం విజయ్ పై కురిపించింది.
కానీ అభిమానులకు లీక్ చేయని 5000 ఫోటలు ఉన్నాయి అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ కేవలం తమ ఇద్దరి మధ్య మాత్రమే ఉన్నాయని నటుడు శుభంకర్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు. `అవి వారికి ఎంతో ప్రత్యేకమైనవి. అలాగే వాటిని తమన్నా..విజయ్ లు ఇష్టపడితే బహిర్గతం చేయోచ్చని, ఆ అవసరం కూడా లేదని అంటున్నాడు. అయితే ఇలా తమ రిలేషన్ సంబంధించిన విషయాలు దాచడం అంత సులభం కాదని, చాలా శ్రమతో కూడుకున్నదే అన్నాడు.
అంతసీక్రెట్ గా ఉంచాలనుకున్నప్పుడు స్నేహితులు ఫోటోలు తీయకుండా జాగ్రత్త పడితే బాగుండే దన్నాడు. నాకు ఎలాంటి ఆంక్షలు లేవు. నావరకూ పంజరంలో ఉండటం ఇష్టముండదు. నా భావాలను ఆ పంజరంలో దాయలేను. ఇద్దరికీ సంబంధించి 5000ల ఫోటోలు ఉన్నాయని, అయితే వాటిని సోషల్ మీడియాలో లేవని..అవి కేవలం వారిద్దరి మధ్యే ఉండాలని చూసుకుంటున్నారు` అన్నారు.
అలాగే విజయ్ మాట్లాడుతూ..` నేటి సమాజంలో, ప్రజలు ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అతను సంబంధాల గురించి మాత్రమే చర్చించాలనుకునే `సబ్కే అందర్ ఏక్ బువా హై` అని వ్యాఖ్యానించారు. మొత్తానికి తమన్నా అభిమానులు చూడలేని ఫోటోలు చాలా ఉన్నాయని ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. మరి వాటి విషయంలో తమన్నా-విజయ్ వర్మలు ఎందుకంత గోప్యత వహిస్తున్నారు? అన్నది తెలియాలి.