తమన్నాతో బ్రేకప్!.. రిలేషన్ షిప్ ఓ ఐస్ క్రీమ్ గా ఎంజాయ్ చేసినట్లైతే!
అదే సమయంలో తాజాగా విజయ్ వర్మ చేసిన కామెంట్స్.. చర్చనీయాంశంగా మారాయి.
By: Tupaki Desk | 29 March 2025 7:55 AMస్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ.. కొంతకాలం క్రితం ప్రేమలో పడిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం విడుదలైన లస్ట్ స్టోరీస్ 2 మూవీ కోసం ఫస్ట్ టైమ్ వర్క్ చేసిన వారిద్దరూ.. షూటింగ్ జరుగుతున్న సమయంలో లవ్ లో పడ్డారు. ఆ తర్వాత అదే విషయాన్ని వివిధ సందర్భాల్లో రివీల్ చేశారు.
అయితే ప్రేమలో పడిన తర్వాత అనేకసార్లు విజయ్, తమన్నా కలిసి కనిపించారు. ప్రతి ఫంక్షన్ లో ఓ రేంజ్ లో సందడి చేశారు. కానీ కొన్ని రోజులుగా పెద్దగా కలిసి కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో బ్రేకప్ జరిగినట్లు ఉందని, ప్రేమ జంట విడిపోయిందని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఆ ప్రచారం ఓ వైపు జరుగుతుండగా.. రీసెంట్ గా హోలీ సెలబ్రేషన్స్ నటి రవీనా టండన్ ఇంట్లో జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలకు ఇద్దరూ వేర్వేరుగా వచ్చారు. ఎక్కడా పిక్స్ దిగినట్లు కనిపించలేదు. దీంతో తమన్నా, విజయ్ విడిపోయారన్న వార్తలకు బలం చేకూరింది. అలా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అదే సమయంలో తాజాగా విజయ్ వర్మ చేసిన కామెంట్స్.. చర్చనీయాంశంగా మారాయి. ముంబయిలో జరిగిన ఓ ఫంక్షన్ కు వచ్చిన ఆయన.. రిలేషన్ షిప్స్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరైనా కూడా రిలేషన్ షిప్ లోని ప్రతి విషయాన్ని ఆస్వాదించాలని, ఆనందించాలని తెలిపారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా వాటిని స్వీకరించాలని అన్నారు.
రిలేషన్ షిప్ ను ఐస్ క్రీమ్ తో పోల్చారు విజయ్. రిలేషన్ షిప్ ఓ ఐస్ క్రీమ్ గా ఎంజాయ్ చేసినట్లైతే, అందరూ ఆనందంగా ఉంటారని అన్నారు. దాని ఫ్లేవర్ ఏదైనా గానీ, కచ్చితంగా స్వీకరించాల్సిందేని తెలిపారు. సంతోషం, బాధ, కోపం, చిరాకు.. అలా అన్నీ యాక్సెప్ట్ చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి.
అయితే రీసెంట్ గా తమన్నా కూడా అలాంటి కామెంట్స్ చేశారు. నిస్వార్థమైన ప్రేమను తాను ఎప్పుడూ నమ్ముతానని వ్యాఖ్యానించారు. ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూడటం మొదలుపెడతామో అప్పుడే సమస్యలొస్తాయని అన్నారు. రిలేషన్ లో లేనప్పుడే హ్యాపీగా ఉన్నానని చెప్పారు. దీంతో తమన్నా, విజయ్ లవ్ బ్రేకప్ అవ్వడం నిజమేనని అనేక మంది అంటున్నారు. మరి అది నిజమో కాదో వారికే తెలియాలి.