కేరళలో దేవరకొండ పోరాటం!
తాజాగా కొత్త షెడ్యూల్ ఈనెల ద్వితియార్దం నుంచి కేరళలో మొదలవుతుంది. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ అక్కడే ఉంటుందని సమాచారం.
By: Tupaki Desk | 7 Sep 2024 5:57 AM GMTవిజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ కి జోడీగా భాగ్య శ్రీ భోర్సే నటిస్తోంది. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా కొత్త షెడ్యూల్ ఈనెల ద్వితియార్దం నుంచి కేరళలో మొదలవుతుంది. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ అక్కడే ఉంటుందని సమాచారం.
ఇందులో పోరాట సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణ కూడా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం. అలాగే అక్టోబర్ నెలఖరుకల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలన్నది యూనిట్ టార్గెట్ గా పెట్టుకుందిట. ఎట్టిపరిస్థితుల్లో దసరా సందర్భంగా టైటిల్ కూడా ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారుట. అంటే అందుకు నెల రోజులు సమయం ఉంది. ఈ లోగా టైటిల్ పై యూనిట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ కూడా లీకవుతుంది. ఇదొక స్పై థ్రిల్లర్ చిత్రంగా ప్రచారంలో వస్తోంది. ఇందులో విజయ్ పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతవరకూ గౌతమ్ తీసిన రెండు సినిమాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. `మళ్లీ రావా`, `జెర్సీ` సినిమాలతో తనదైన సెన్సిబిలిటీ హైలైట్ అయింది.
రెండు సినిమాలకు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. రెండింటిలోనూ ఎమోషన్ హైలైట్. అయితే విజయ్ సినిమా స్పై జానర్ కావడంతో ఎమోషన్ ఎంతవరకూ క్యారీ అవుతుందన్నది చూడాలి. స్పై సినిమాలు ఇంతవరకూ గౌతమ్ కూడా టచ్ చేయలేదు. ఆ రకంగా ఈ జానర్ లో ఇదే తొలి సినిమా.