Begin typing your search above and press return to search.

GOAT - అక్కడ కూడా అంతంతమాత్రంగానే..

ప్రభుదేవా, లైలా కూడా మంచి ప్రాధాన్యత ఉన్న రోల్స్ లో కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Sep 2024 7:57 AM GMT
GOAT - అక్కడ కూడా అంతంతమాత్రంగానే..
X

ఇళయదళపతి విజయ్ GOAT మూవీతో సెప్టెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. భారీ బడ్జెట్ తో హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. సీనియర్ యాక్టర్స్ ప్రశాంత్, స్నేహ కీలక పాత్రలలో నటించారు. ప్రభుదేవా, లైలా కూడా మంచి ప్రాధాన్యత ఉన్న రోల్స్ లో కనిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే కొంతకాలంగా సౌత్ స్టార్ హీరోలకి హిందీలో మంచి ఆదరణ లభిస్తూ ఉంది. గతంలో ఇళయదళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన లియో మూవీ లాంగ్ రన్ లో 32 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా నార్త్ ఇండియాలో సింగిల్ స్క్రీన్స్ లోనే విడుదలైంది. సినీపోల్స్, పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ మల్టీ ప్లెక్స్ లో ప్రదర్శించబడలేదు. థియేటర్స్ లో రిలీజ్ చేసిన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన నార్త్ లో ఉంది.

లియో సినిమా విషయంలో ఈ నిబంధనకి ఒప్పుకోకపోవడంతో ప్రధాన మల్టీప్లెక్స్ లు లియో చిత్రాన్ని ప్రదర్శించలేదట. అయిన కూడా మూవీ మంచి వసూళ్లని అందుకుంది. మల్టీప్లెక్స్ లలో కూడా లియో చిత్రాన్ని ప్రదర్శించి ఉంటే మరింత ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవనే మాట వినిపిస్తోంది. అయితే GOAT మూవీ ఇప్పుడు నార్త్ ఇండియాలో మల్టీప్లెక్స్ లలో కూడా రిలీజ్ అవుతోంది. లియో సినిమా తర్వాత నార్త్ లో విజయ్ కి మార్కెట్ పెరిగింది.

పబ్లిక్ విజయ్ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. GOAT మూవీ యూనివర్సల్ కథాంశంతో స్పై థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది. అక్కడ స్పై థ్రిల్లర్ కథలకి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా GOAT సినిమాకి ఆదరణ వస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అయితే మూవీ ప్రమోషన్స్ ని మాత్రం చిత్ర యూనిట్ ఆశించిన స్థాయిలో చేయడం లేదు. దీంతో లియోతో పోల్చుకుంటే GOAT మూవీపైన హైప్ తక్కువ ఉంది.

మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ పెద్దగా బజ్ క్రియేట్ చేయకపోవడం ఈ చిత్రానికి కొంత మైనస్ అవ్వొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాకి మౌత్ టాక్ వస్తేనే ప్రేక్షకులకి GOAT మూవీ రీచ్ అవుతుందని భావిస్తున్నారు. దళపతి విజయ్ ఈ చిత్రం తర్వాత హీరోగా మరొక్క సినిమా మాత్రమే చేయనున్నాడు. దాని తర్వాత సినిమా కెరియర్ కి స్వస్తి చెప్పి రాజకీయ ప్రయాణం చేయబోతున్నాడు. అందుకే ఫ్యాన్స్ మాత్రం GOAT సినిమా భారీ సక్సెస్ అందుకోవాలని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.