Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి చిట్ట చివ‌రి సినిమా మ‌రొక‌టి ఉంది!

అయితే అంతకుముందే బెంగళూరుకు చెందిన పంపిణీ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ శుక్రవారం మరో చిత్రానికి సంతకం చేసినట్లు ప్రకటించింది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 3:15 AM GMT
ద‌ళ‌ప‌తి చిట్ట చివ‌రి సినిమా మ‌రొక‌టి ఉంది!
X

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజయ్ త్వరలో తన సినీ కెరీర్‌ను వదులుకుని రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. అయితే అంతకుముందే బెంగళూరుకు చెందిన పంపిణీ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ శుక్రవారం మరో చిత్రానికి సంతకం చేసినట్లు ప్రకటించింది. తన కొత్తగా స్థాపించిన పార్టీ 'తమిళగ వెట్రి కళగం'తో రాజకీయాల్లోకి రాకముందే విజ‌య్ తన 69వ చిత్రాన్ని పూర్తి చేస్తారనే వార్త‌ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.

శుక్రవారం KVN ప్రొడక్షన్స్ వారి X (గతంలో ట్విట్టర్) పేజీలో విజయ్ చివరి చిత్రం గురించి వెల్ల‌డించారు. వారు మొదట విజయ్ ముఖాన్ని చూపించకుండా అతడి హిట్ చిత్రాల ఫోటోల‌తో మాష‌ప్ ని షేర్ చేసారు. అయితే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? క‌థానాయిక ఎవ‌రు? అన్నదానిపై వివ‌రాలేవీ బ‌య‌ట‌కు రాలేదు.

దళపతిపై ప్రేమ.. మేమంతా మీ చిత్రాలతో పెరిగాము.. మీరు అడుగడుగునా మా జీవితంలో భాగమయ్యారు. 30 ఏళ్లకు పైగా మమ్మల్ని అలరించినందుకు థాంక్యూ దళపతి! అంటూ కేవీఎన్ వ‌ర్గాలు ధ‌న్య‌వాదాలు తెలిపారు. కొన్నేళ్లుగా అభిమానులతో విజయ్ మాట్లాడుతూ ఉన్న ఒక పుస్త‌కాన్ని కూడా వారు షేర్ చేసారు. ఆయన సినిమాలతో తమకున్న అనుబంధం గురించి అభిమానులు మాట్లాడుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన శనివారం రానుందని ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది. విజ‌య్ న‌టించిన 68వ సినిమా `ది గోట్` ఇటీవ‌లే విడుద‌లై త‌మిళంలో మంచి వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే.