తరుణ్ కెరీర్ గురించి విజయ్ భాస్కర్ ఏమన్నారంటే?
తరుణ్ అప్పట్లో హీరోగా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. వారసులెవరూ ఇండస్ట్రీలో లేని సమయంలో తరుణ్ దే హవా.
By: Tupaki Desk | 9 Aug 2024 5:15 AM GMTతరుణ్ అప్పట్లో హీరోగా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. వారసులెవరూ ఇండస్ట్రీలో లేని సమయంలో తరుణ్ దే హవా. లవర్ బోయ్ ఇమేజ్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న స్టార్. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన తరుణ్ `నువ్వేకావాలి`తో హీరోగా తెరంగేట్రం చేసాడు. అటుపై కొన్నాళ్ల పాటు తరుణ్ ఎదురు లేకుండా సాగి పోయాడు.
సరిగ్గా అదే సమయంలో ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ కూడా మొదలైంది. దీంతో నెమ్మదిగా తరుణ్ కి అవకాశాలు తగ్గాయి. గ్రాప్ కూడా తగ్గడం మొదలైంది. అటుపై అవకాశాలే లేకుడా ఖాళీ అయిపోయాడు. తాజాగా తరుణ్ వెనుకబడటానికి కారణం ఏమై ఉండొచ్చు? అని తరుణ్ని పరిచయం చేసిన దర్శకుడు విజయ్ భాస్కర్ ని అడిగితే ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
`తరుణ్ చాలా ఇంటెలిజెంట్. యాక్షన్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఆ తరువాత ఆ తరహా సినిమాలేవో? ఒకటి రెండు చేసినట్టు ఉన్నాడు. అలాంటి సినిమాలే చేయాలనేం లేదు. నీ సినిమాలు నీకు ఉంటాయి . నీ ఆడియన్స్ నీకు ఉంటారు ..నీ ఐడెంటిటీ నీకు ఉంటుందని నేను చెప్పాను. ఈ విషయంలో తను ఎంచుకున్న మార్గం తప్పు అని అననను. కొన్నిసార్లు కుదురదంతే. దానికి తరుణ్ బాధ్యుడు కాదు` అని అన్నారు.
2010 నుంచి తరుణ్ కి పూర్తిగా అవకాశాలు తగ్గాయి. 2010-18 కాలంలో మూడు నాలుగు సినిమాలు చేసాడు. చివరిగా `ఇది నా లవ్ స్టోరీ` లో నటించాడు. లవర్ బోయ్ ఇమేజ్ నేపథ్యంలో ఆ సినిమా మంచి కంబ్యాక్ అవుతుందని అలాంటి స్టోరీని ఎంచుకున్నాడు. కానీ నిలబడలేకపోయాడు. ఆ తర్వాత మళ్లీ తరుణ్ సినిమాలు చేసింది లేదు. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండడు. అప్పుడప్పుడు తనికి బాగా తెలిసిన వారి సినిమా ఈవెంట్లలో మాత్రం కనిపిస్తుంటాడు.